
రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో రాణించిన సునంద
కమలాపురం : కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్స్ కాలనీకి చెందిన చౌడం సునంద రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు తాడేపల్లి గూడెం సరస్వతి విద్యాలయం ప్రత్తిపాడులో జరిగిన 6వ రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీల్లో పాల్గొన్న సునంద 35–40 ఏజ్ గ్రూప్‌లోని ట్రెడిషనల్ ఆసనాల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నారు. అలాగే ట్విస్టింగ్ ఆసనాల పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించారు. కాగా సెప్టెంబర్ నెలలో ఛత్తీస్‌ఘడ్‌లో జరిగే జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొననున్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న సునందను పలువురు భారతి పరిశ్రమ ప్రతినిధులు, ఉద్యోగులు అభినందించారు.