
విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించామని జిల్లా క్రీడల అభివృద్ది అధికారి కె. జగన్నాథరెడ్డి తెలిపారు. క్రీడాపాఠశాలలో నాలుగో తరగతి ప్రవేశానికి అర్హత సాధించిన 19 విద్యార్థులకు 18 మంది, 5వ తరగతిలో 33 మంది విద్యార్థులకు గాను 29 మంది హాజరైనట్లు తెలిపారు. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు పలు పత్రాలను పరిశీలించారు. రాష్ట్రంలో క్రీడా పాఠశాలకు ఎంపికై న విద్యార్థులు వారి తల్లిదండ్రులు రావడంతో క్రీడా పాఠశాల ప్రాంగణం సందడి నెలకొంది. కాగా విద్యార్థుల సర్టిఫికెట్‌లను క్రీడా పాఠశాలలోని కోచ్‌లు క్షుణ్ణంగా పరిశీలించారు.