
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
పులివెందుల: రాజకీయ సాంప్రదాయాలకు టీడీపీ తూట్లు పోడిచి పోటీకి సిద్ధపడిందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కనంపల్లెలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలుచేయకుండా ప్రజలందరినీ మోసం చేసిందన్నారు. సుపరి పాలనలో తొలి అడుగు అని ప్రజల ముందుకు వెళ్లి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారన్నారు. ప్రజా వ్యతిరేకత వల్లే పులివెందులలో దాడులు, దౌర్జన్యం, ధనబలం, అధికార బలం ఉపయోగించి అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. వేల్పుల రాము, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లపై దాడులు హత్యాయత్నం చేసి వాహనాలు ధ్వంసం చేశారన్నారు. పులివెందులలోని గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో భయానక వాతావరణం సృష్టించి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నా రు. పులివెందుల ప్రాంతం సస్యశ్యామలంగా ఉందంటే కేవలం వైఎస్‌ఆర్, వైఎస్ జగన్ వల్లేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే గెలవలేమని కూటమి నాయకులు డిసైడ్ అయ్యారన్నారు. ఎలక్షన్ కమీషన్, అధికార యంత్రాంగం ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చూడాన్నారు.