జూదరుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

జూదరుల అరెస్టు

Aug 7 2025 7:46 AM | Updated on Aug 7 2025 8:14 AM

జూదరు

జూదరుల అరెస్టు

ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ఆంధ్ర కేసరి రోడ్డులో పేకాడుతున్న నలుగురిని టూటౌన్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. పేకాడుతున్నారని సమాచారం రావడంతో బుధవారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. నలుగురిని అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ. 20 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వైవీయూ ఆచార్యుడికి ఫెలోషిప్‌

కడప ఎడ్యుకేషన్‌ : వైవీయూ ఆచార్యులు డాక్టర్‌ పి.వాసుగోవర్ధనరెడ్డికి జర్మనీలో అలెగ్జాండర్‌ వాన్‌ హంబోల్ట్‌ ఫౌండేషన్‌ ఇచ్చే ఫెలోషిప్‌ దక్కింది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు జర్మనీలో గోవర్ధన్‌రెడ్డి ప్రొఫెసర్‌ రెనే విల్హెల్మ్‌ మార్గదర్శకత్వంలో అసమాన ఆర్గానోక్యాటాలిసిస్లోపై పరిశోధన చేశారు. డాక్టర్‌ రెడ్డి ఎన్‌–హెపిరో సైక్లిక్‌ కార్సెనెస్‌ ఉత్ప్రేరక అనువర్తనాల పనితీరును గుర్తించి ఆ రంగంలో స్థిరమైన వృద్ధి ఫలితాలను తెచ్చారు. డాక్టర్‌ పి.వాసుగోవర్ధనరెడ్డి గతంలోనూ ప్రొఫెషనల్‌, నెట్‌ వర్కింగ్‌ ఈవెంట్లలో భాగస్వామ్యులయ్యారు. జర్మనీలో ఆయన పరిశోధనలకు ఫెలోషిప్‌ దక్కింది. ఈ సందర్భంగా యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, కుల సచివులు ఆచార్య పి పద్మ, ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌, అధ్యాపకులు అభినందించారు.

బి.మఠం రాజగోపురంపై కలశాల ఏర్పాటు

బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం దక్షణ రాజగోపురానికి నూతన కలశాలను బుధవారం ఏర్పాటు గతంలో రాజగోపురంపై కలశాలను కోతులు విరగకొట్టడంతో దేవస్థానం నిర్వాహకులు నూతన కలశాలు ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

సుండుపల్లె : అక్రమంగా తరలిస్తున్న పది ఎర్రచందనం దుంగలను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీశాఖ అధికారి వై.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వివరాలలోకి వెళ్లితే.. రాయవరం సెక్షన్‌ సుండుపల్లె బీట్‌ పరిధిలోని సద్దికూళ్లవంక చెక్‌పోస్టు దగ్గర అటవీశాఖ అధికారులు నాకాబందీ నిర్వహించారు. ఒక హుండాయ్‌ కారు వేగంగా వచ్చి బారిగేట్‌ వేసిన విషయం పసిగట్టి సుండుపల్లె మార్గంలోకి వెళ్లగా అటవీ సిబ్బంది వెంబడించారు. సిబ్బందిని చూసి వాహనాన్ని నిలిపి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. వాహనం తనిఖీ చేయగా అందులో 326 కేజీలు గల పది ఎర్రచందనం దుంగలున్నాయి. ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకుని పారిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు ఎఫ్‌ఆర్‌ఓ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలో రాయవరం డీవైఆర్‌ఓ రమేష్‌బాబు, ఎఫ్‌బీఓ అంజన స్వామి, గౌషా, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

థర్మాకోల్‌ ప్లేట్లలో ఆహారం తింటే ప్రమాదం

చిన్నమండెం : థర్మాకోల్‌ పేట్లలో ఆహారం తీసుకుంటే ప్రమాదమని ఆహార భద్రతా అధికారి వెంకటరెడ్డి అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ చిన్నమండెం మండల కేంద్రంలో ఇటీవల పానీపూరీ విక్రయిస్తున్న దుకాణాల్లో థర్మాకోల్‌ ప్లేటు వాడుతున్న విషయం గమనించి వ్యాపారులను మందలించామని తెలిపారు. వినియోగదారుల నుంచి ఇటీవల ఫిర్యాదులు వసుత్న్నాయని తెలిపారు. జనాల బలహీనతలతో వ్యాపారం చేయకూడదని, మండల వ్యాప్తంగా పానీపూరీ దుకాణాలపై తనిఖీలు చేపట్టామన్నారు. వేడిగా ఉన్న కట్‌లెట్‌, పానీపూరీ తదితర ఫాస్ట్‌ఫుడ్‌ థర్మాకోల్‌ ప్లేట్లలో ఇవ్వడం గుర్తించామన్నారు. వాటిలో ఆహారం తీసుకుంటే ప్లాస్టిక్‌ కణాలు వేడికి ఆహార పదార్థాల్లో కలిసి కడుపులోకి వెళ్తాయని, కాలేయం దెబ్బతిని ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. క్రమంగా క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్టీలు పాత్రలే వాడాలని, పానీపూరి తయారీలో నాణ్యత విలువలు పాటించాలని సూచించారు.

జూదరుల అరెస్టు 1
1/2

జూదరుల అరెస్టు

జూదరుల అరెస్టు 2
2/2

జూదరుల అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement