
ఎన్నికలకు దూరంగా సహకారం
కాశినాయన : వ్యవసాయ రంగం అభివృద్ధి కంటే రాజకీయంగా పదవుల పందేరానికి సహకార వ్యవస్థ దోహదపడుతోందనే ఆరోపణలున్నాయి. త్రీమెన్, ఫైవ్‌మెన్ కమిటీలను వేస్తూ రైతులకు తూతూ మంత్రంగా సేవలు అందిస్తున్నారు. ప్రశ్నించే వారే లేకపోవడంతో కొన్ని చోట్ల సిబ్బంది ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు గతంలో సహకార వ్యవస్థను తీసుకొచ్చారు. సహకార పరపతి సంఘాలను ఏర్పాటుచేసి వాటిద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాలకవర్గాలను ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నుకోవడం క్రమేణా జరుగుతోంది. 2013 ఫిబ్రవరిలో నిర్వహించిన ఎన్నికల తర్వాత ఇంతవరకూ తిరిగి ఎన్నికలు జరగలేదు. దాదాపు 12ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో సహకార వ్యవస్థ లక్ష్యానికి దూరంగా వెళుతోందని విమర్శలున్నాయి. ఈ క్రమంలో పట్టించుకునేవారే కరవయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలో 77 సహకార సంఘాలున్నాయి. వాటికి మొన్నటి వరకు త్రీసభ్య కమిటీలుండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంగా కమిటీలను వేయలేదు. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రత్యేక నిధులు వచ్చేవి. పాలక వర్గాలు లేకపోవడంతో ఈ నిధులు మంజూరుకావడం లేదు. నిధులు రాక రైతులకు అందించే రుణాల్లో రాయితీలు దక్కని పరిస్థితి నెలకొంది. అంతేగాక వ్యవసాయ రంగానికి తోడ్పాటును అందించేలా పంపిణీ చేసే ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు, వ్యవసాయ పనిముట్లను రైతులు పొందలేకపోతున్నారు.
పాలకుల సిఫారసుతోనే...
సహకార సంఘాలకు ఏ కారణాలతో ఎన్నికలు నిర్వహించడం లేదనేది చెప్పేవారే లేరు. అధికారులు మాత్రం పాలకుల నిర్ణయం మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ఇంతకు మించి వివరణ ఇవ్వలేమంటూ సమాధానం దాటవేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలకవర్గాల స్థానంలో నియమించే కమిటీలు ఆయా ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల సిఫారసులతోనే ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకూ కమిటీలను ఎందుకు వేయలేదో అర్థం కావడంలేదు. రేపు మాపు అంటూ ఏడాది గడిపేశారు. ఈ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావాహుల ఆశలు నెరవేరడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 77 సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను వేసేందుకు సంబంధిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో ప్రక్రియ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికార పార్టీ నాయకులు అంటున్నట్లు సమాచారం.
నామినేటెడ్ పదవులతో సరి
ఏడాదిగా అతిగతీ లేని వైనం