
సాయుధ పోలీసు బలగాల ఫ్లాగ్ మార్చ్
పులివెందుల : ఈ నెల 12వతేదీన నపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సాయుధ బలగాలతో పోలీసు అధికారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రశాంత, స్వేచ్చాయుత ఎన్నిక లక్ష్యంగా రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రజలకు భరోసా కల్పిస్తూ కనంపల్లె, నల్లపురెడ్డిపల్లె, ఆర్.తుమ్మలపల్లె గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఎవరైనా ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పులివెందుల సబ్ డివిజన్‌లోని సీఐలు, ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రసవత్తరంగా విద్యుత్ ఉద్యోగుల క్రీడల పోటీలు
కడప కార్పొరేషన్ : విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. స్థానిక జోనల్ ఆఫీసు మైదానంలో జరిగిన ఈ క్రీడల్లో వాలీబాల్‌లో కడప, కర్నూలు జట్లు తలపడగా కర్నూలు జట్టు విజయం సాధించింది. బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో కడప జట్టు విజయం సాఽధించింది. మహిళా ఉద్యోగినులకు చెస్, క్యారమ్స్ నిర్వహించారు. ఏపీ ట్రాన్స్ కో చీఫ్ ఇంజినీర్ క్రిష్ణ కుమార్ ఈ క్రీడా పోటీలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ శ్రీరామచంద్రమూర్తి, స్పోర్ట్స్ సెక్రటరీ మస్తాన్, వీరాంజనేయులు, కల్చరల్ సెక్రటరీ వీరభద్రయ్య, వెంకట సుబ్బయ, శరణ్ పాల్గొన్నారు.

సాయుధ పోలీసు బలగాల ఫ్లాగ్ మార్చ్

సాయుధ పోలీసు బలగాల ఫ్లాగ్ మార్చ్