
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ప్రొద్దుటూరు ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సోమవారం ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్‌కు చెందిన కుంటుమల్ల సంతోష్, మహేంద్రనగర్‌కు చెందిన చౌడం ప్రేమచక్రి, మత్స్యకాలనీకి చెందిన గొర్రె నాగసాయి మిత్రులు. వీరు జల్సాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు లోనయ్యారు. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో నిషేధిత గంజాయి విక్రయించే మార్గాన్ని ఎంచుకున్నారు. పట్టణంలో కొన్ని ప్రాంతాల్లోని యువకులను పరిచయం చేసుకొని గంజాయిని విక్రయిస్తున్నారు. గంజాయిని చిన్న చిన్న పొట్లాల రూపంలో చుట్టి రూ.500 నుంచి రూ. 5000 వరకు విక్రయిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు యువకులు దొరసానిపల్లె రోడ్డులోని భావనారాయణ స్వామి ఆలయం వద్ద గంజాయి విక్రయిస్తుండగా ప్రొద్దుటూరు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ సురేంద్రారెడ్డి, కడప ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ నీలకంఠేశ్వరరెడ్డిలు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో ముగ్గురు యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1800 గ్రాముల గంజాయి, మూడు ద్విచక్రవాహనాలు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడైన కుంటుమల్ల సంతోష్ విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం వద్ద గల ఒక ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి చౌడం ప్రేమ్‌చక్రి, గొర్రె నాగసాయిలకు విక్రయించేవాడని ఎక్సైజ్ సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు చెప్పారు.