
విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం
కమలాపురం : విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. సోమవారం కమలాపురంలో నిర్వహించిన సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపై ఫీజుల భారం అధికం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నడుపుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగేశ్వర రావు, రెడ్డయ్య, రమణ, మాజీ ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
ఏఐఎస్‌ఎఫ్ కమలాపురం ఏరియా నూతన కమిటీని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. కమలాపురం ఏరియా అధ్యక్షుడిగా రాఘవేంద్ర, కార్యదర్శిగా షేక్ సాదిక్, ఉపాధ్యక్షుడిగా మణికంఠ రెడ్డి, తిలక్, సహాయ కార్యదర్శులుగా షేక్ రబ్బాని, సుబ్బరాయుడు, వెంకట సాయి, కోశాధికారిగా శశికాంత్, సోషల్ మీడియా సభ్యులుగా ఫయాజ్, అంజి తదితరులను ఎన్నుకున్నారు.