కలగా మారిన ‘కల్తీ నియంత్రణ’ | - | Sakshi
Sakshi News home page

కలగా మారిన ‘కల్తీ నియంత్రణ’

Aug 5 2025 6:25 AM | Updated on Aug 5 2025 6:25 AM

కలగా మారిన ‘కల్తీ నియంత్రణ’

కలగా మారిన ‘కల్తీ నియంత్రణ’

మనిషి జీవించడానికి ప్రధానంగా కూడు, గూడు, గుడ్డ అవసరం. ఈ మూడింటిలో మనం తీసుకొనే ఆహారానికి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఆహర అంశానికి చెందిన కీలకమైన ‘జిల్లా సహాయ ఆహార నియంత్రణ శాఖ’ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఫలితంగా కల్తీ నియంత్రణ కలగా మారింది.

కడప రూరల్‌ : మనం తీసుకొనే ఆహార పదార్ధాలకు సంబంధించిన అంశాలను ‘జిల్లా సహాయ ఆహార నియంత్రణ శాఖ’పరిధిలోకి వస్తాయి. అంటే మనిషి ఆరోగ్య పరిరక్షణలో ఈ శాఖ పాత్ర ఎంతో కీలకమైంది. అలాంటి సంస్థ సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది.

సంస్ధ లక్ష్యం ఇదీ...

మనం తినే ప్రతి ఆహారాన్ని పర్యవేక్షించే బాధ్యతలు ఈ శాఖ పరిధిలోకే వస్తాయి. హోటళ్లు, బేకరీలు, గోధుమ, పసుపు, నూనెలు, పండ్ల వ్యాపారాలు తదితర ఆహార పదార్ధాల విక్రయ తయారీ కేంద్రాల్లోని కల్తీలను ఆ శాఖ పరిశీలించాలి. అందుకు సంబంధించి జిల్లాలో రెండు డివిజన్‌లు ఉన్నాయి. కడప డివిజన్‌–1లో కడప కార్పొరేషన్‌తో పాటు బద్వేల్‌, మైదుకూరు. ప్రొద్దుటూరు డివిజన్‌–2 పరిధిలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల ఉన్నాయి. ఒక డివిజన్‌కు ఒక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉండాలి. వీరి పర్యవేక్షణలోనే కల్తీల తనఖీలు జరుగుతుంటాయి. ఫిర్యాదులు వచ్చినా లేదా ఏదైనా అనుమానం ఉన్నా తనిఖీలు చేపడతారు. అలాగే ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటారు. వివిధ పదార్థాలు..వస్తువుల నుంచి ఒక నెలకు 12 శ్యాంపిల్స్‌ తీయాలి. అంటే ఒక శ్యాంపిల్‌తో పాటే అదనంగా రెండు తీసుకుంటారు. ఆ ప్రకారం ఒక నెలకు మొత్తం 36 శ్యాంపిల్స్‌ను తీస్తారు. ఒక్కో శ్యాంపిల్‌ చొప్పున కల్తీ నిర్ధారణ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని నాచారంలో గల ల్యాబొరేటరీకి పంపిస్తారు. అక్కడ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఇక్కడి అధికారులు చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు పరీక్షల్లో నాసిరకం అని తేలితే ‘సబ్‌ స్టాండెడ్‌, మిస్‌ బ్రాండెడ్‌’ అని అంటారు. దీనికి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ స్థాయిలో విచారణ జరుగుతుంది. అలాగే తినడానికి వీలులేని పదార్థాలు, వస్తువులను ‘అన్‌సేఫ్‌’అంటారు. దీనికి న్యాయ స్ధానం శిక్ష ఖరారు చేస్తుంది. సంబంధిత వ్యకికి రూ 2 లక్షల నుంచి రూ 10 లక్షల వరకు భారీగా జరిమానా పడడంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. అదేవిధంగా ఈ శాఖ ప్రభుత్వ రంగ సంస్థలైన హస్టళ్లు, ఐసీడీఎస్‌ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఆహార పథకాలను కూడా పర్యవేక్షించే అధికారం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంస్థ లక్ష్యాల జాబితా చాంతాడంత ఉంటుంది.

శాపంగా మారిన కొరత...

కీలకమైన ఈ శాఖకు కొరత శాపంగా మారింది. ముఖ్యమైన జిల్లా ఆహార సహయ భధ్రతా అధికారి (అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోల్‌ ఆఫీసర్‌) పోస్ట్‌ ఇన్‌చార్జీల పాలనలో నడుస్తోంది. ఇన్నాళ్లు పనిచేసిన ప్రభాకర్‌రావు ఒక నెల క్రితం పదవీ విరయణ పొందారు. దీంతో నెల్లూరు జిల్లా అధికారి వెంకటేశ్వరరావును ఇక్కడ ఇన్‌ఛార్జి అధికారిగా నియమించారు. ఈయన మరో రెండు జిల్లాలకు కూడా ఇన్‌ఛార్జి అధికారిగా విధులను చేపడుతున్నారు. ఇక అసిస్టెంట్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ల పాత్ర ఎంతో కీలకమైంది. కల్తీ నియంత్రణలో వీరి ప్రాత్ర ప్రధానమైంది. కడప డివిజన్‌–1లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న షంషీర్‌ఖాన్‌ మే 23వ తేదీన బదిలీ అయ్యారు. దీంతో ప్రొద్దుటూరు డివిజన్‌–2 విధులను చేపడుతున్న హరిత, కడప డివిజన్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే కార్యాలయంలో మరికొన్ని పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. ప్రధానంగా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లకు వాహనాలు లేకపోవడం శోచనీయం.చివరికి ఆ శాఖ జిల్లా సహయ అధికారికి కూడా వాహనం లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నా..ఎవరైనా ఫిర్యాదు చేసినా బస్సులు లేదా తమ ద్విచక్ర వాహనాల్లో వెళ్లాలి. మారుమూల ప్రాంతాల్లోకి ఉన్నఫలంగా వెళ్లాలన్నా, రోజు వారీ పనులను నిర్వహించాలన్నా, ఈ సంస్థ అధికారులకు పెద్ద పరీక్షలా మారింది.

జిల్లాలో తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు?

జిల్లా వ్యాప్తంగా కుప్పలు, తెప్పలుగా హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలు, వస్తువులను తయారు చేసే కేంద్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కాగా ఈ శాఖ పరిధిలో అధికారికంగా లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ కలిగిన సంస్థలు తక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. లైసెన్స్‌ పరిధిలోకి పెద్ద హోటళ్లు, నూనె తదితర ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు, హోల్‌సేల్‌, రిటైల్‌ డిస్ట్రిబ్యూటర్లు తదితర వ్యాపార కేంద్రాలు వస్తాయి. రిజిస్ట్రేషన్‌ పరిధిలో చిన్న హోటళ్లు ఉంటాయి. అధికారికంగా అన్నింటినీ కలుపుకున్నా లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ కలిగినవి తక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి.

గాలిలో పర్యవేక్షణ...

ఆహర పదార్థాలు కలుషితం అవుతే మనిషి అనారోగ్యం పాలవుతారు. ఫుడ్‌ పాయిజన్‌ అయితే ఆరోగ్యం విషమంగా మారుతుంది. చిన్న పిల్లలు, పెద్దలకు కడుపులో మంట, నొప్పి, వాంతులు, విరేచనాలు ఇలా ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే డాక్టర్‌ వద్దకు వెళతారు. సదరు వైద్యుని నుంచి ‘ఎక్కడ తిన్నారు..ఏం తిన్నారు’. అనే ప్రశ్న వస్తుంది. కలుషిత ఆహరం తీసుకొని పలువురు అస్వస్థతకు గురైన సంఘటనలు ఎన్నో చూశాం. కాగా సమస్యలు..ఇబ్బందులు ఇలా ఎన్నయినా ఉండవచ్చు. ‘ఆహార నియంత్రణ’లో పర్యవేక్షణ మాత్రం కొరవడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ శాఖను గాలికి వదిలేయకుండా, ప్రజా ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించేలా చర్యలు చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వివరణకు ఏఎఫ్‌సీ వెంకటేశ్వరరావు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ హరితను సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదు.

సిబ్బంది కొరత

కొరవడిన పర్యవేక్షణ

నిస్సహయంగా మారిన ‘జిల్లా సహాయ ఆహార నియంత్రణ శాఖ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement