
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన
పులివెందుల : పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన పులివెందుల మండలంలో జరిగే జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగిందని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశానన్నారు. కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సీఐలు ఉలసయ్య, వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.
బి.ఫారాలు అందజేత
కడప సెవెన్‌రోడ్స్ : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్‌రెడ్డి, ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలను ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు వారిరువురికి సంబంధించిన బి.ఫారాలను కార్పొరేటర్ మల్లికార్జున, సోషల్ వెల్ఫేర్ మాజీ చైర్మన్ పులి సునీల్‌కుమార్ సోమవారం ఎన్నికల అధికారి సి.ఓబులమ్మకు అందజేశారు.
సమస్యలు పరిష్కరించాలి
కడప సెవెన్‌రోడ్స్ : వర్కింగ్ జర్నలిస్టులు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులు సోమవారం డీఆర్వోకు వినతిపత్రాన్ని సమర్పించారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని, పెన్షన్ చెల్లింపు, అక్రిడిటేషన్ల జారీకి వీలుగా కొత్త జీఓ తీసుకు రావాలన్నారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల అవార్డుల ప్రదానం చేపట్టాలని కోరారు. వృద్ధ జర్నలిస్టుల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు చంద్రమోహన్‌రాజు, నూర్‌బాష, రాజేష్, రవిప్రకాశ్, సిద్దయ్య, నారాయణ, అమర్, పఠాన్, విష్ణు, రవి తదితరులు పాల్గొన్నారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన