
1321 టన్నుల యూరియా రాక
కడప అగ్రికల్చర్ : జిల్లాకు 1321 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ తెలిపారు. సోమవారం జేడీఏ కార్యాలయ టెక్నికల్ ఏవో గోవర్ధన్‌తో కలిసి జిల్లాకు రాక్‌లో వచ్చిన ఎరువులను ఆయన పరీశీలించారు. వైఎస్సార్ జిల్లాకు 942 మెట్రిక్ టన్నులను కేటాయించగా ఇందులో 426 మెట్రిక్ టన్నులను మార్కెఫెడ్‌కు, మిగతా 516 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించారు. అలాగే అన్నమయ్య జిల్లాకు 380 టన్నులను కేటాయించారు. ఇందులో 235 టన్నులను మార్కెఫెడ్‌కు, మిగతా 145 టన్నులను ప్రైవేటు డీలర్లు కేటాయించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ మాట్లాడుతూ డీలర్లు ఎవరైనా కృత్రిమ కొతర సృష్టించినా, అధిక ధరలకు అమ్మినట్లు తెలిసిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.