
పోలీసుల గస్తీ
సిద్దవటం: సిద్దవటం పెన్నానదిపై ఉన్న లోలెవల్ కాజ్‌వే పై పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర మాట్లాడుతూ సిద్దవటం వద్ద పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆదివారం పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారన్నారు. ఒంటిమిట్ట సీఐ బాబు, సిద్దవటం ఎస్‌ఐ సూచనల మేరకు కాజ్‌వేపైన పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రమాదాలు జరగకుండా మందస్తు చర్యగా అక్కడికి పర్యాటకులను రానివ్వలేదన్నారు. ఉదయం చేపలు పట్టే వారు వస్తే వారిని కూడా అక్కడినుంచి పంపిచేశామన్నారు.కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి నదిలోకి దిగుతారనే ఉద్దేశంతో కాజ్‌వే వద్ద ఉన్నామని ఏఎస్‌ఐ తెలిపారు.