
మహిళా ప్రయాణికురాలిపై దురుసు ప్రవర్తన
వీరభద్రస్వామిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ వీరభద్రస్వామిని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బసవరాజు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ట్రాక్టర్ అదుపు తప్పి వ్యక్తి మృతి
కలకడ : ట్రాక్టర్ అదుపు తప్పి ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. శనివారం రాత్రి కలకడ మండలంలోని రాతిగుంటపల్లె పంచాయతీ, బట్టావారిపల్లె సమీపంలోని టమాటా పంట సాగుకు వినియోగించే సీడ్స్ కర్రలను కలకడ మండలంలోని దేవులపల్లెకు తరలిస్తుండగా రాతిగుంటపల్లె పంచాయతీ లక్ష్మీపురం గ్రామం మలుపువద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దేవులపల్లెకు చెందిన వెంటరత్నం(38) అక్కడికక్కడే మృతి చెందగా, గుర్రంకొండ మండలం మర్రిమేకలవారిపల్లె దళితవాడకు చెందిన నరసింహులుకు కాలు విరిగి తీవ్ర రక్తగాయాలయ్యాయి. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం కసిరెడ్డిగారిపల్లె పంచాయతీ దళితవాడ సమీపంలో ఆదివారం ఆగి ఉన్న కారును టీవీఎస్ ఎక్సెల్ ఢీకొన్న సంఘటనలో బోనంశెట్టి రవీంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు రామాపురం పోలీసులు తెలిపారు. కడప నుంచి రాయచోటి వైపు వెళ్తున్న టీఎన్ 01ఏఈ 7263 నెంబర్ గల కారు గువ్వలచెరువు దళితవాడ సమీపంలో ఆగి ఉండగా వెనుకవైపు నుంచి సరస్వతిపల్లెకు చెందిన బోనంశెట్టి రవీంద్ర ఏపీ02బివి 8652 నెంబర్ గల టీవీఎస్ ఎక్సెల్‌లో వస్తూ ప్రమాదవశాత్తు కారును ఢీకొన్నాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్లట్లు రామాపురం పోలీసులు తెలిపారు.
మద్యానికి బానిసలై ఇద్దరి మృతి
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో మద్యానికి బానిసైన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండలంలోని బసినికొండకు చెందిన లక్ష్మన్న, పద్మ దంపతుల కుమారుడు పవన్ (40)కు 15 సంవత్సరాల క్రితం భారతితో వివాహం కాగా, పెళ్లయిన ఏడాదికే ఆమె అనారోగ్య కారణాలతో మృతి చెందింది. అప్పటినుంచి పవన్ మద్యానికి బానిసై, పనులకు వెళ్లకుండా నిత్యం మద్యం తాగుతూ ఉండేవాడు. ఆదివారం బసినికొండ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద, అతిగా మద్యం తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా, గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. అదేవిధంగా పట్టణంలోని మార్పురి వీధికి చెందిన ఖాదర్ బాషా కుమారుడు షరీఫుద్దీన్ (38) మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి పనులకు వెళ్లకుండా నిత్యం మద్యం తాగేవాడు. అతని భార్య హమీదా స్థానికంగా కూలి పనులకు వెళ్తూ కుమారుడిని కుటుంబాన్ని పోషించుకుంటుంది.
వేంపల్లె : రాయచోటి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో కండక్టర్ మహిళా ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించాడు. ఆదివారం వేంపల్లె–రాయచోటి బస్సులో కండక్టర్ మహిళ మెడపై చెయ్యి వేసి నెట్టి ఆమెను దుర్భాషలాడాడు. ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్దాం పద అన్న తర్వాత కండక్టర్ తగ్గాడు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి డిపో బస్సులోనే ఇలా జరగడం చాలా బాధాకరమని ప్రయాణికులు మండిపడ్డారు.
చిన్నపాటి వర్షానికి కారడం దారుణం..
వేంపల్లె – రాయచోటికి ప్రయాణించే ఆర్టీసీ బస్సు చాలా దారుణంగా ఉందని ప్రయాణికులు మండిపడ్డారు. ఆదివారం రాయచోటి డిపోకు చెందిన ఏపీ02జెడ్ 0254 నంబర్ గల ఏపీఎస్ ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో ప్రయాణికులు మొత్తం వర్షపు నీటితో తడిచిపోయారు. వర్షం పడితే ఆ బస్సులో ప్రయాణికులు స్నానం చేసినట్లే అని వాపోతున్నారు. ఈ బస్సులో ప్రతి కిటికీకి అద్దం ఒకటే ఉంది. రాయచోటి ఆర్టీసీ డీఎం గమనించి ఇలాంటి పాతబడిన, కాలం చెల్లిన బస్సులను నడపొద్దని ప్రయాణికులు కోరుతున్నారు.
ఒకరికి తీవ్ర గాయాలు

మహిళా ప్రయాణికురాలిపై దురుసు ప్రవర్తన

మహిళా ప్రయాణికురాలిపై దురుసు ప్రవర్తన

మహిళా ప్రయాణికురాలిపై దురుసు ప్రవర్తన

మహిళా ప్రయాణికురాలిపై దురుసు ప్రవర్తన