
చెలరేగిపోతున్న గ్రావెల్ మాఫియా
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చింతకొమ్మదిన్నె మండల పరిధిలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. సంబంధిత శాఖల అధికారులు వారికి కూటమి ప్రభుత్వం నేతల అండదండలు ఉన్నాయనే నెపంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గుట్టలు, చెరువులు గుల్ల చేసిన గ్రావెల్ మాఫియా అటవీ ప్రాంతాల్లో నాణ్యమైన గ్రావెల్ లభిస్తుండటంతో రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో సైతం చెట్లను తొలగించి గ్రావెల్ తరలిస్తున్నారు. గత మూడు రోజులుగా రేయింబవళ్లు కొలుములపల్లె పంచాయతీలోని గుర్రంగుంపు రిజర్వాయర్ పైభాగంలోని దక్షిణ దిశలో రిజర్వు ఫారెస్ట్ గుల్ల చేస్తూ మూడు పెద్ద హిటాచీలు, 30 టిప్పర్లు ఏర్పాటు చేసుకొని గ్రావెల్ మాఫియా వ్యాపారం చేస్తోంది. యథేచ్ఛగా జాతీ య రహదారిపై మూడు రోజులుగా టిప్పర్లు గ్రావెల్ లోడుతో ప్రయాణిస్తున్నా మైనింగ్ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.