
న్యాయ సహాయం కోసం చట్టపరమైన అవగాహన పెంచుకోవాలి
కడప అర్బన్ : న్యాయ సహాయం కోసం చట్టపరమైన అవగాహన ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు.్ఙనల్సా (జాగృతి – అట్టడుగు స్థాయి సమాచారం, పారదర్శకత చొరవ కోసం న్యాయం అవగాహన) పథకం 2025 పై జిల్లా జాగృతి యూనిట్ సభ్యులకు శిక్షణ, ఓరియంటేషన్ కార్యక్రమం్ఙ శనివారం న్యాయసేవాసదన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయ సహాయం పొందడంలో సవాళ్లు, న్యాయ సహాయం కోసం చట్టపరమైన అవగాహన, ప్రస్తుత చట్టపరమైన నిబంధనలు, ఉచిత న్యాయ సహాయం తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి గరికపాటి దీన బాబు, ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శాంతి, 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.రమేష్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫక్రుద్దీన్, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే, కడప డీఎస్పీ ఎ. వెంకటేశ్వర్లు, కడప అడిషనల్ మున్సిపల్ కమిషనర్ కె.రాకేష్ చంద్రం, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
డాక్టర్ సి.యామిని