ఓరియెంటేషన్ కార్యక్రమంపై అవగాహన
కడప అర్బన్ : మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి, ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్మన్ ఎల్. వెంకటేశ్వరరావు సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి సెక్రటరీ, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి సి.ఆసిఫా సుల్తానా కడపలోని న్యాయ సేవా సదన్‌లో సోమవారం ‘నిరుపేద పిల్లల కోసం సతి ప్రచార పత్రం అమలు – ఆధార్ కోసం సర్వే, ట్రాకింగ్ మరియు సమగ్ర చేరికకు ప్రాప్యత‘ అనే అంశంపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కమిటీ పేద పిల్లల అవసరాలను గుర్తించి వారికి న్యాయ సహాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనోజ్ హెగ్డే, డీఆర్‌ఓ ఎంవీ నాయుడు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ శ్రీలక్ష్మి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాలస్వామిరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు, పారా లీగల్ వలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు.


