అధికారులు ఒత్తిడి తీసుకువచ్చి.. నిర్మాణం చేయించి..
రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన గోకులం షెడ్లను ఉపాధి హామీ సిబ్బంది.. లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్మాణాలు పూర్తి చేయించారు. గోకులం షెడ్ల నిర్మాణంలో మూడు దశల్లో బిల్లులు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. అయితే బిల్లులు పడకపోయినప్పటికీ నిర్మాణాలు పూర్తి చేయాలని, మూడు బిల్లులు ఒకేసారి పడతాయని చెప్పి పనులు పూర్తి చేయించారు. ఈ ఏడాది జనవరి 10, 12వ తేదీలలో షెడ్యూల్ ఏర్పాటు చేసి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయి నాయకులు అధికారులతో కలసి అట్టహాసంగా ప్రారంభించారు. వీటికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా రూ.30–40 కోట్ల వరకు బిల్లులు అందాల్సి ఉందని ఉపాధి హామీ పథకం అధికారులు చెబుతున్నారు. అధికారుల ఒత్తిడి వల్ల అప్పులు చేసి షెడ్లను నిర్మించుకున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు.


