మహిళలపై కూటమి నాయకుల దాడి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లి గ్రామంలో మహిళలపై కూటమి నాయకులు గురువారం రాత్రి స్థానిక విచక్షణా రహితంగా దాడి చేశారు. తుమ్మల జయమ్మ, సంధ్య, తుమ్మల స్పందన, మత్తయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. భాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో స్థల వివాదం ఉండడంతో పలు వివాదాలలో పాత్ర వహించిన రాపూర్ రమేష్, వినేష్, నితేష్, మరి కొందరు మహిళలపై దాడి చేసి బెదిరించారు. తాము పోలీస్‌స్టేషన్‌కు వచ్చినప్పటికీ పోలీసులు తమతో మాట్లాడకుండానే రేపు సమగ్రంగా విచారించి చర్యలు తీసుకొంటామని చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ హేమసుందర్ రావు మాట్లాడుతూ సంఘటనా స్థలానికి వెళ్లి విచారించాక తగిన విధంగా చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.


