కూలీ కొడుకుకు ద్వితీయ ర్యాంకు
కూలి పనులు చేసుకుంటున్న చిన్నపుల్లయ్య కుమారుడు ఏపీ ఈసెట్‌లో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంకు సాధించాడు. రాజుపాలెం మండలం కూలూరు గ్రామానికి చెందిన మెట్టు చిన్నపుల్లయ్య, ఏసమ్మల కుమారుడు మొట్టు దివాకర్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓ ప్రైవేటు పాఠశాలలో చదివాడు. ఆ తరువాత డిప్లమా ఈఈఈని తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్తి చేశాడు. ఏపీ ఈసెట్ ఈఈఈ విభాగంలో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంకు సాధించాడు. కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసి తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తానని మొట్టు దివాకర్ తెలిపారు.


