జమ్మలమడుగు : విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసంలో జరిగే శ్రీ నారాపురస్వామి బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామి భక్తులకు ఉదయం కల్పవృక్ష వాహనంపై, సాయంత్రం హనుమంత వాహనంపై దర్శనం ఇచ్చారు. స్వామి వారికి పల్లకీలో పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లకీ వెంట భక్తులు కోలాటం ఆడుతూ, అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ కదిలారు. దేవదేవు డుఇంటి ముందుకు కల్పవృక్ష వాహనంపై రావడంతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయాల్లో హుండీల చోరీ
కలసపాడు : మండలంలోని పాత రామాపురం, ఈ. రామాపురం గ్రామాలలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శ్రీ అభయాంజనేయ స్వామి, శివాలయం, దేవాలయంలో గుడి తాళాలు పగలగొట్టి హుండీలో ఉన్న నగదు దొంగిలించారు. గుడి పూజారి రాళ్లపల్లె ప్రభు కలసపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.శ్రీనివాసులు, కలసపాడు ఎస్‌ఐ తిమోతి సంఘటన స్థలాలను పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఘాట్ రోడ్డులో కారు దగ్ధం
ముద్దనూరు : ముద్దనూరు – జమ్మలమడుగు ఘాట్ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున కారులో మంటలు చెలరేగాయి. కొండాపురం నుంచి జమ్మలమడుగు వైపు ప్రయాణిస్తున్న కారు ఘాట్ రోడ్డులో సగం దూరం వెళ్లే సరికి బ్యానెట్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై కారును నిలిపివేశాడు. బ్యానెట్ తెరచిన తర్వాత మంటలు వ్యాపించడంతో అతను కారుకు దూరంగా పరిగెత్తాడు. దీంతో కారులో తీవ్రంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
టిప్పర్ ఢీకొని ట్రాక్టర్ బోల్తా
చింతకొమ్మదిన్నె : వరి గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక వైపున టిప్పర్ ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చింతకొమ్మదిన్నె మండలం ఆజాద్ నగర్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో వరిగడ్డి కట్టలు చెల్లాచెదురయ్యాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోయినా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
టిప్పర్ ఢీకొని ట్రాక్టర్ బోల్తా
అల్లదిగో.. వేంకటేశ్వరుడు!


