
వెన్ను తట్టి ప్రోత్సహించారు
మాది మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీ. నాన్న పేరు షేక్ అహ్మద్‌బాషా.చిరు వ్యాపారి. నా అభిరుచికి అనుగుణంగానే చదువుకోమని స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన సమక్షంలోనే నా బాల్యం బాగా సరదాగా గడిచింది. ఆయనే నాకు గురువు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే వారు. చదువే ముఖ్యమని తరచూ చెప్పేవారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని పదే పదే హిత బోధ చేసేవారు. ఆయన ప్రోత్సాహంతోనే బీటెక్ పూర్తి చేసిన తరువాత సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. మొదటిలో ర్యాంకు రాకపోవడంతో నాన్న ఎంతో ధైర్యమిచ్చారు. ఆ ధైర్యంతోనే రెండోసారి 2022లో సివిల్స్ రాశాను. సివిల్స్ పరీక్ష ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాను. మా నాన్నే నాకు హీరో.. ఆయనే స్ఫూర్తి.
–షేక్ ఆయిషా,డిప్యూటీ కలెక్టర్ (ట్రైనింగ్)