
జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాల కారణంగా జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు వర్షం కురిసింది. రెండు రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పులతో అకాశమంతా మేఘామృతమైంది. ప్రస్తుతం ఉపరితల ద్రోణి ఆవర్తనంతో వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
నిత్యాన్నదానానికి విరాళం
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి శనివారం రూ.1,00,116లు విరాళంగా వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి తెలిపారు.దువ్వూరు మండలం పెద్ద భాకరాపురానికి చెందిన ఉమ్మడి ఆంజనేయులు, ఆయన సతీమణి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు విరాళం అదజేశారని చెప్పారు.ఈసందర్భంగా ఆలయ ఉప ప్రధాన అర్చకుడు రాజారమేష్ దాతలకు తీర్థప్రసాదాలను అందజేశారు.స్వామి వారి చిత్రపటం అందించారు.వారిని శేషవస్త్రంతో సత్కరించారు.కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, దాతల కుటుంబసభ్యులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.
రోలర్ స్కేటింగ్‌లో ధ్రుతికి పతకం
కలసపాడు: మండలంలోని దిగువ తంబళ్ళపల్లె గ్రామానికి చెందిన పల్లెశివక్రిష్ణారెడ్డి, పావనిల కుమార్తె పల్లె ధ్రుతికి జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్‌లో అండర్–7, అండర్–9లలో ద్వితీయ స్థానం లభించింది. ధ్రుతి చిన్నప్పటి నుండి స్కేటింగ్‌లో ఆసక్తి చూపడంతో అనంతపురం జిల్లాలో గ్రామీణ నీటిపారుదలశాఖలో ఏఈగా పనిచేస్తున్న తండ్రి శివక్రిష్ణారెడ్డి ప్రోత్సహించారు. ఈ క్రమంలో తాలూకా, డివిజన్ స్థాయిలో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని పలు ర్యాంకులు సాధించింది. గతేడాది నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగిన ఏపీ రోలర్ స్కేటింగ్‌లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికై ంది. ప్రస్తుతం గోవాలో వివిధ కేటగిరీలలో మూడు రోజులుగా జరిగిన జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్‌లో ధ్రుతి ద్వితీయ స్థానం సాధించింది. నిర్వాహకులు మెడల్‌ను అందజేశారు. ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.రమణారెడ్డి ధృతికి అభినందనలు తెలిపారు.

జిల్లాలో వర్షం