టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక

Jan 31 2024 1:16 AM | Updated on Jan 31 2024 1:16 AM

దువ్వూరు:పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి - Sakshi

దువ్వూరు:పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి

దువ్వూరు : దువ్వూరులో మంగళవారం కటారు రాఘవేంద్ర, కటారు రఘు ఆధ్వర్యంలో 50 కుటుంబాల వారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్‌ చేసిన సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ పార్టీ విధానాలు నచ్చి తమతోపాటు అర్ధాకుల కృష్ణయ్య, బండి లక్ష్మీదేవి, బండి నాగేంద్ర, బండి రాజేష్‌, తోటా సుబ్బనారాయణ, యనమల పెద్ద సుబ్బరాయుడు, చిన్న సుబ్బరాయుడు, శెట్టిపల్లె మునెయ్యలతోపాటు 50 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయర్త శెట్టిపల్లె నాగిరెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ చిరాకి బాషా, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ కానాల ఓబుళరెడ్డి, జేసీఎస్‌ కన్వీనర్‌ ఇరగం శంకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కోగటం వీరారెడ్డి, జొన్నవరం వీరారెడ్డి పాల్గొన్నారు.

అట్లూరులో 40 కుటుంబాలు..

అట్లూరు : మండల పరిధిలోని కొండూరు ఎస్టీ కాలనీ నుంచి 40 కుటుంబాల వారు బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ సమక్షంలో మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వీరు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు దున్నూతల బాలక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో బద్వేలులో ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల సచివాలయాల కన్వీనర్‌ మన్యం మల్లికార్జునరెడ్డి, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

వీరపునాయునిపల్లెలో 35 కుటుంబాలు..

వీరపునాయునిపల్లె : మండలంలోని గోనుమాకులపల్లె గ్రామం బీసీ కాలనీకి చెందిన 35 కుటుంబాల వారు మంగళవారం మండల అధ్యక్షుడు రఘునాథరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సుధాకర్‌, శ్రీకాంత్‌, రామాంజనేయులు, సుబ్బరాయుడు, మల్లేసు, బాలమునెయ్య, గంగాధర, బ్రహ్మయ్య, రాముడు, గంగయ్య, చంద్ర ఓబుల్‌రెడ్డి, ఆంజనేయులు, మల్లేసు, మల్లికార్జున, గురుమోహన్‌, మునెయ్య, శివలక్ష్మి, ప్రశాంతి, పెద్ద ఈశ్వరయ్య, చిన్న చెండ్రాయుడు, పెద్ద చెండ్రాయుడు, చిన్న ఈశ్వరయ్య, చంద్రకాశి, ఓబులేసుతో పాటు మరో 11 కుంటుంబాల వారు పార్టీలో చేరారు. వీరందరికి మండల అధ్యక్షుడు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. గోనుమాకులపల్లె సర్పంచు సురేంద్రకుమార్‌ యాదవ్‌, ఓబుల్‌రెడ్డిపల్లె సర్పంచు విజయ్‌కుమార్‌ యాదవ్‌, మండల బీసీ నాయకుడు ప్రతాప్‌ యాదవ్‌, స్థానిక నాయకులు గోవిందురెడ్డి, పుల్లారెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

అట్లూరు: వైఎస్సార్‌సీసీలో చేరిన వారితో ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ1
1/2

అట్లూరు: వైఎస్సార్‌సీసీలో చేరిన వారితో ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ

వీరపునాయునిపల్లె: వైఎస్సార్‌సీపీలో చేరిన గోనుమాకులపల్లె బీసీ కాలనీ వాసులు2
2/2

వీరపునాయునిపల్లె: వైఎస్సార్‌సీపీలో చేరిన గోనుమాకులపల్లె బీసీ కాలనీ వాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement