ప్రవీణ్‌.. నా కొడుకును ఎందుకు చంపమన్నావు? | - | Sakshi
Sakshi News home page

ప్రవీణ్‌.. నా కొడుకును ఎందుకు చంపమన్నావు?

Oct 31 2023 1:06 AM | Updated on Oct 31 2023 11:56 AM

- - Sakshi

ప్రొద్దుటూరు : ‘టీడీపీ నేత ప్రవీణ్‌రెడ్డి నా కుమారుడైన బెనర్జీని ఎందుకు చంపమని ఆదేశించావు.. మా వాడు ఏ పాపం చేశాడు. ఏ రోజు అయినా నీ జోలికి వచ్చాడా’ అని వైఎస్సార్‌సీపీ కార్యకర్త బెనర్జీ తల్లి బుజ్జమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. ఉద్దేశ పూర్వకంగానే బస్సు యాత్ర రోజున తన కుమారుడిని హత్య చేసేందుకు పురమాయించావన్నారు.

నిత్యం ప్రవీణ్‌ వెంట తిరిగే భరత్‌కుమార్‌రెడ్డి ఆయన చెప్పందే ఈ విధంగా చేయడని తెలిపారు. ఎస్సీలమైన తాము రాజకీయాల్లో ఉండకూడదనేది మీ లక్ష్యమా అని ప్రశ్నించారు. మా కుమారుడు ఏమైనా మీ ఆస్తుల జోలికి, మీ కుటుంబ సభ్యుల జోలికి వచ్చాడా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన కొడుకుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు.

ప్రజలందరూ చూస్తుండగా పట్టపగలు జంతువులా తమ కుమారుడిని ఎలా నరికాడన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో తన కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, వైద్యం కోసమే రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మానవతా హృదయంతో స్పందించి వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తానని తెలిపారన్నారు. సమావేశంలో బెనర్జీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement