షార్ట్‌ సర్క్యూట్‌తో వరికోత మిషన్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో వరికోత మిషన్‌ దగ్ధం

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

రామగిరి(నల్లగొండ): షార్ట్‌ సర్క్యూట్‌తో వరికోత మిషన్‌ దగ్ధమైంది. ఈ ఘటన నల్లగొండ మండల పరిధిలోని మేళ్ల దుప్పలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన బండారు శంకర్‌ ఆదివారం రాత్రి తన వరికోత మిషన్‌తో గ్రామ పరిధిలో వరి పంట కోసేందుకు వెళ్లాడు. పొలానికి వెళ్లిన వరికోత మిషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి సమయం కావడంతో మంటలను అదుపు చేసే అవకాశం లేక మిషన్‌ పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ, వారు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఆలస్యం కావడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మిషన్‌తో పాటు ఇంజన్‌ కూడా పూర్తిగా కాలిపోయిందని, సుమారు రూ.25 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వరికోత మిషన్‌ యజమాని బండారు శంకర్‌ కన్నీటిపర్యంతమయ్యాడు. అప్పు చేసి, కొంత బ్యాంకు రుణంతో కొనుగోలు చేసిన వరికోత మిషన్‌ కళ్లెదుటే కాలిపోయిందని బాధితుడు వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement