కోదాడ(అనంతగిరి) : ద్విచక్ర వాహనంపై వెళ్తు న్న ఇద్దరు యువకులను డీసీఎం ఢీకొనడంతో మృతిచెందారు. ఈ ఘటన అనంతగిరి మండలం తమ్మర గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన భూక్య లీలాప్రసాద్(22), భూక్య నవీన్(22) ద్విచక్ర వాహనంపై కోదాడ వైపు వెళ్తుండగా.. తమ్మర గ్రామ సమీపంలోని చెరువు వద్దకు రాగానే తమ్మర నుంచి గొండ్రియాల వైపు వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లీలాప్రసాద్, నవీన్ అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు లీలాప్రసాద్ తండ్రి భూక్య బాబురావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనంతగిరి ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. డీసీఎం డ్రైవర్ కప్పల వినోద్ అతివేగంగా వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు యువకులు మృతి


