కార్తీకమాసానికి నృసింహుడి క్షేత్రం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

కార్తీకమాసానికి నృసింహుడి క్షేత్రం సిద్ధం

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కార్తీకమాసానికి సిద్ధమైంది. మంగళవారం నుంచి నెల రోజుల పాటు వత్ర మండపంలో భక్తులు సత్యనారాయణస్వామి వత్రాలు జరిపించేందుకు ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వ్రత పూజల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మండపంలో వ్రత పీటలు, వ్రతానికి సంబంధించిన సామగ్రి సిద్ధం చేశారు. ఈవో భవానీశంకర్‌ వ్రత మండపంలోని ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. భక్తుల సౌకర్యార్థం సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించేందుకు వ్రత సమయాల్లో మార్పులు చేసినట్లు ఈవో వెల్లడించారు.

యాదగిరీశుడి క్షేత్రంలో ఇలా..

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో రోజుకు ఆరు బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మొదటి బ్యాచ్‌ ఉదయం 7:00 నుంచి 8:00 గంటల వరకు, రెండో బ్యాచ్‌ 9:00 నుంచి 10:00 గంటల వరకు, మూడో బ్యాచ్‌ 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, నాల్గవ బ్యాచ్‌ 1:00 నుంచి 2:00 గంటల వరకు, ఐదో బ్యాచ్‌ 3:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు, ఆరో బ్యాచ్‌ 5:00 నుండి 6:00 గంటల వరకు ఉంటాయి. 24వ తేదీన కార్తీక శుద్ధ పౌర్ణిమ రోజున మాత్రం ఉదయం 5గంటల నుంచి రాత్రి 7గంటల వరకు 8 బ్యాచ్‌లకు అవకాశం కల్పిస్తామని ఈఓ చెప్పారు.

పాతగుట్ట ఆలయంలో..

యాదగిరీశుడి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నాలుగు బ్యాచ్‌లుగా వ్రతాలను జరిపించనున్నారు. మొదటి బ్యాచ్‌ ఉదయం 9గంటలకు, రెండో బ్యాచ్‌ 11గంటలకు, మూడో బ్యాచ్‌ మధ్యాహ్నం 2గంటలకు, నాల్గవ బ్యాచ్‌ సాయంత్రం 4గంటలకు వ్రత పూజలు జరిపిస్తారు.

నేటి నుంచి యాదగిరిగుట్టలో

సత్యనారాయణస్వామి వ్రతాలు

నెల రోజులు.. రోజుకు ఆరు బ్యాచ్‌లు

కార్తీక శుద్ధ పౌర్ణిమ రోజు

8 బ్యాచ్‌లుగా నిర్వహణ

వ్రత మండపంలో ఏర్పాట్లను

పరిశీలించిన ఈవో భవానీశంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement