టీపీసీసీ అధికార ప్రతినిధిగా బోయలపల్లి రేఖ | - | Sakshi
Sakshi News home page

టీపీసీసీ అధికార ప్రతినిధిగా బోయలపల్లి రేఖ

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

● రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలిగా కూడా మరోసారి నియామకం

అర్వపల్లి : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) రాష్ట్రఽ అధికార ప్రతినిధిగా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన డాక్టర్‌ బోయిలపల్లి రేఖ నియమితులయ్యారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆమె రేఖ చారిటబుల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకరాలుగా కూడా పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా సమస్యలపై గళమెత్తడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆమె చురుకై న పాత్ర పోషిస్తున్నారు. పార్టీ బలోపేతానికి, మహిళా సాధికారతకు ఆమె చేస్తున్న కృషికి ఈ నియామకాలు గుర్తింపునిచ్చాయి.

పోచంపల్లికి ఫ్రాన్స్‌ దేశస్తులు

భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లిని సోమవారం ఫ్రాన్స్‌ దేశానికి చెందిన నలుగురు పర్యాటకులు సందర్శించారు. టూరిజం పార్కులోని మ్యూజి యంలో మగ్గాలు, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, వస్త్రాల తయారీ ఫొటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం ఇక్కత్‌ వస్త్రాలు, డిజైన్‌లను పరిశీలించి చేనేత కళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. భారతదేశ పర్యటనలో భాగంగా ఇక్కత్‌ వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరొందిన పోచంపల్లి సందర్శనకు వచ్చినట్లు పర్యాటకులు తెలిపారు.

సీఎంతో ముఖాముఖికి

ప్రత్యేక ఆహ్వానం

● జపాన్‌ పర్యటన అనుభవాలను

పంచుకోనున్న ఉపాధ్యాయుడు రాజశేఖర్‌

హుజూర్‌నగర్‌(గరిడేపల్లి) : ఇటీవల జపాన్‌లో పర్యటించి అక్కడి విద్యావిధానంపై అధ్యయనం చేసి వచ్చిన గరిడేపల్లి మండలం రంగాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, సైకాలజిస్ట్‌ చారుగుండ్ల రాజశేఖర్‌కు నవంబర్‌ 14న సీఎం రేవంత్‌రెడ్డితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 5 నుంచి 12 వరకు జపాన్‌లో పర్యటించిన రాజశేఖర్‌.. అక్కడి విద్యాసంస్థలను సందర్శించి బోధనా పద్ధతులు, క్రమశిక్షణ, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్య తదితర అంశాలను అధ్యయనం చేశారు. ఈ పర్యటనలో పొందిన అనుభవాలు, రాష్ట్ర విద్యావ్యవస్థలో అమలు చేయాల్సిన ఉత్తమ విధానాలపై తన అభిప్రాయాలను ఆయన సీఎంతో పంచుకోనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎస్‌ఈఆర్‌టీ) డైరెక్టర్‌ రమేష్‌ ప్రకటించారు.

చిన్నారులపై పిచ్చికుక్క దాడి

సూర్యాపేట(ఆత్మకూర్‌ (ఎస్‌)) : ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలో సోమవారం పిచ్చికుక్క పలువురు చిన్నారులపై దాడి చేసింది. మండల కేంద్రానికి చెందిన రాంచరణ్‌ గౌడ్‌ పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, అదేవిధంగా గొట్టిముక్కల మోక్షిత్‌రెడ్డి ఇంట్లో గేటు వద్ద నిలబడగా వారిపై పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు గ్రామంలో మరొకరిపై కూడా పిచ్చికుక్క దాడి చేసి కరిచినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement