సాక్షి యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న కార్తీకోత్సవం–2026 పోస్టర్ను కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ అనురాగ్ జయంతి, ఈఓ భవానీశంకర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్తీకమాస పవిత్రతను చాటడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ ప్రాచీన కళారూపాలను భావితరాలకు పరిచయం చేసేందుకు యాదగిరిగుట్ట దేవస్థానం కార్తీకోత్సవాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. భక్తులలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే దిశగా ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని వివరించారు.


