ఇంటి స్థలం కోసం జవాన్‌ నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

ఇంటి స్థలం కోసం జవాన్‌ నిరీక్షణ

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

భువనగిరి టౌన్‌: ఎన్నో ఏళ్లుగా భారత సైన్యంలో పనిచేస్తున్న ఆర్మీ జవాన్‌.. భార్యాపిల్లల కోసం చిన్న ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఆలేరు పట్టణా నికి చెందిన ఆర్మీ జవాన్‌ నెమలి కనకరాజు భారత సైన్యంలో 13 ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. మరో రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్న కనకరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైనిక సంక్షేమ నిబంధనల ప్రకారం ఆలేరు పట్టణ పరిధిలో 500 గజాల నివాస స్థలం కేటాయించాలని ఆయన గత కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

సెలవుల్లో అధికారుల చుట్టూనే..

స్థలం కోసం ఆర్మీ కమాండింగ్‌ అధికారి (సీఓ) సిఫారసు లేఖ సమర్పించినా రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదు. గతంలో 2024 ఏప్రిల్‌ 22న కలెక్టర్‌కు, 2025 ఏప్రిల్‌ 19న తహసీల్దార్‌కు, 2026 మే 4న మళ్లీ కలెక్టర్‌కు స్వయంగా దరఖాస్తులు ఇచ్చారు. సోమవారం భువనగిరి కలెక్టరేట్‌లో ప్రజావాణిలో కలెక్టర్‌కు మరోసారి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆరు నెలలకోసారి వచ్చే 15 రోజుల సెలవుల్లో ఇంటి కంటే కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగడానికే సరిపోతోంది. తీరా వెళ్తే అధికారులు సీట్లలో ఉండరు. ఫార్వర్డ్‌ చేస్తాం, పరిశీలిస్తాం అంటూ ఏళ్లుగా దాటవేస్తున్నారు అని కనకరాజు కన్నీటిపర్యంతమయ్యాడు. కుటుంబం అద్దె ఇంట్లోనే ఉందని, ఇంటి స్థలం ఇస్తే కుటుంబాన్ని అక్కడ ఉంచి ప్రశాంతంగా సైన్యంలో నిమగ్నమవుతానని ఆయన వేడుకున్నారు.

సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌

ప్రజావాణిలో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఆర్మీ జవాన్‌ నెమలి కనకరాజు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తాను ఇటీవల శ్రీనగర్‌లో విధులు నిర్వర్తించి ప్రస్తుతం రాజస్థాన్‌కు వచ్చినట్లు కనకరాజు వివరించగా.. తాను కూడా మూడేళ్ల క్రితం శ్రీనగర్‌లోనే బాధ్యతలు నిర్వహించానని కలెక్టర్‌ గుర్తుచేసుకున్నారు. ఇద్దరూ శ్రీనగర్‌ జ్ఞాపకాలను పంచుకోవడం అక్కడి వారిని ఆకట్టుకుంది. అనంతరం భూమి కేటాయింపు అర్జీపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. దేశ రక్షణలో సేవలందిస్తున్న జవాన్ల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని, దరఖాస్తును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

13 ఏళ్లుగా దేశ సేవ..

అద్దె ఇంట్లోనే భార్యాపిల్లలు

స్థలం మంజూరు చేయాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement