బుద్ధవనంలో ఘనంగా ధమ్మ దీపోత్సవం | - | Sakshi
Sakshi News home page

బుద్ధవనంలో ఘనంగా ధమ్మ దీపోత్సవం

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

పెద్దవూర(నాగార్జునసాగర్‌) : నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో సోమవారం ధమ్మ దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బౌద్ధాభిమానులు, వివిధ బౌద్ధ సంఘాల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ధమ్మ జ్యోతుల వెలుగుతో బుద్ధవనం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా బుద్ధవంలోని అశోక ధర్మచక్రం వద్ద ధమ్మ జ్యోతులను వెలిగించి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మహాస్థూపంలోని బుద్ధుడి విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం బౌద్ధాభిమానులు మహాస్థూపం చుట్టూ పరిక్రమ నిర్వహించి ధ్యాన మందిరంలో బుద్ధుడి విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని ద ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ(ఇప్లూ) ప్రొఫెసర్‌ సంతోష్‌ రావత్‌ మాట్లాడుతూ.. ధమ్మ దీపోత్సవానికి బౌద్ధ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. జ్ఞానోదయం పొందిన అనంతరం సిద్దార్థుడు బుద్ధుడిగా కపిలవస్తు నగరానికి తిరిగి వచ్చినపుడు ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని వివరించారు. అలాగే బుద్ధడు బౌద్ధ భిక్షువులు మూడునెలల వస్సవాసాన్ని పూర్తిచేసుకుని జనవాసాలకు తిరిగి వచ్చే సందర్భంలో ప్రజలు దీపాలతో స్వాగతం పలికే సంప్రదాయానికి గుర్తుగా ధమ్మ దీపోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. నేటి సమాజంలో బుద్ధుడి శాంతి, అహింస, కరుణ సందేశాలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఐ తెలంగాణ అధ్యక్షుడు పరందాములు, ఎస్‌కేఎల్‌ ఇంటర్నేషనల్‌ తెలంగాణ, ఆంధ్రప్రధేశ్‌ చాప్టర్ల అధ్యక్షుడు వాల్మీకి హరికృష్ణ, నాగపూర్‌కు చెందిన డివికీలాడ్రి గౌతం జగదొండే, సమాధాన్‌ దొండే, వివిద బౌద్ధ సంఘాల ప్రతినధులు, బుద్ధవనం ఓఎస్‌డీ సుధాన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శాసన, ఆర్ట్స్‌ అండ్‌ ప్రమోషన్‌ ఇన్‌చార్జి మేనేజర్‌ శ్యాంసుందర్‌రావు, ఏఈ నజీష్‌, ఎస్టేట్‌ ఆఫీసర్‌ రవిచంద్రారెడ్డి, టూరిజం గైడ్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement