ఛార్జింగ్‌ చేస్తుండగా పేలిన ఈవీ స్కూటర్‌ | - | Sakshi
Sakshi News home page

ఛార్జింగ్‌ చేస్తుండగా పేలిన ఈవీ స్కూటర్‌

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

నిడమనూరు: ఛార్జింగ్‌ పెట్టిన ఓ ఎలక్ట్రిక్‌ (ఈవీ) స్కూటర్‌ పేలిపోయి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. నారమ్మగూడెం గ్రామానికి చెందిన ఎస్‌కే హైమద్‌ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి వరండాలో(రేకుల షెడ్డు ఆవరణ) తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు ఛార్జింగ్‌ పెట్టాడు. గంటన్నర తర్వాత పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి. హైమద్‌ నిద్రలేచి చూసేసరికి స్కూటర్‌ పూర్తిగా దగ్ధం కాగా, పక్కనే ఉన్న ఫ్రిజ్‌, కూలర్‌ తదితర గృహోపకరణాలకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదాన్ని హైమద్‌ తల్లి ఖతిజా ముందుగా గుర్తించి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది. దీంతో పక్క గదిలో ఉన్న గ్యాస్‌ సిలిండర్లు, ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సుమారు రూ.2 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని హైమద్‌ తెలిపాడు. ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రముఖ కంపెనీకి చెందినదని, 13 నెలల క్రితం రూ.1.25 లక్షలకు కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నాడు.

మేళ్లచెరువులో..

హుజూర్‌నగర్‌(మేళ్లచెరువు) : మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఎస్వీ రెడిమేడ్‌ షాపు యాజమాని వెంకటరెడ్డి సోమవారం ఉదయం తన ఎలక్ట్రిక్‌ బైక్‌కు చార్జింగ్‌ పెట్టగా కొద్దిసేపటికి మంటలు వ్యాపించి బైక్‌ దగ్ధమైంది. పక్కనే వస్త్ర దుకాణం, కిరాణ షాపు ఇతర దుకాణాలకు మంటలు అంటుకుంటే ఆస్తి నష్టం వాటిల్లేదని స్థానికులు పేర్కొన్నారు.

పూర్తిగా దగ్ధమైన ద్విచక్ర వాహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement