రాజాపేట : ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ భారతీయ పౌరులకు దేశంలో ఒకేచోట ఓటు ఉండటానికి మాత్రమే సర్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మేకల రమేష్, సర్పంచ్ కోయ మధు, రిటైడ్ ప్రధానోపాధ్యాయుడు బూర్గు మహేందర్రెడ్డి, ఉపాధ్యాయుడు బిర్రు సుదర్శన్, లాయర్లు పెంట రమేష్, గొట్టిపాముల సాయికృష్ణ పాల్గొన్నారు.


