కొత్త పింఛన్లు వస్తున్నాయ్‌! | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లు వస్తున్నాయ్‌!

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

సాక్షి, యాదాద్రి : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘చేయూత’ పింఛన్లపై ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 19 నుంచి కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల వడపోత కార్యక్రమం ప్రస్తుతం తుది దశకు చేరింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల విచారణను ఈ నెల 11లోగా పూర్తి చేసి, ఫైనల్‌ లిస్ట్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. జిల్లాలో ప్రస్తుతం 94,953 మందికి పింఛన్లు అందుతుండగా.. కొత్తగా సుమారు 13 వేల మందికి ప్రయోజనం కలగనుందని అధికారులు భావిస్తున్నారు.

360డిగ్రీల కోణంలో పరిశీలన

కొత్త పింఛన్ల కోసం జిల్లాలో మొత్తం 17,480 దరఖాస్తులు రాగా, క్షేత్రస్థాయి విచారణల అనంతరం డీఆర్‌డీఓ స్థాయికి 13,684 అప్లికేషన్లు చేరాయి. వీటిలో ఇప్పటికే 10,270 దరఖాస్తులకు తుది ఆమోదం లభించగా, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్ల లాగిన్లలో ఉన్న మిగిలిన 3,414 దరఖాస్తుల పరిశీలన తుది దశలో ఉంది. వివిధ శాఖల అధికారులు 360 డిగ్రీల కోణంలో పరిశీలిస్తున్న ఈ ప్రక్రియను ఈ నెల 11 నాటికి పూర్తి చేసి తుది జాబితాను ఖరారు చేయనున్నారు.

12 నుంచి18 వరకు ప్రత్యేక సభలు

తుది జాబితా ఖరారైన తర్వాత, ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నేరుగా మండల కేంద్రాలు, మున్సిపాలిటీల వారీగా ప్రత్యేక సభలు నిర్వహిస్తా రు. ఈ సభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నూతన లబ్ధిదా రులకు అధికారిక ప్రొసీడింగ్స్‌ పత్రాలను అందజేస్తారు.

నిబంధనల్లో మార్పులు

ప్రొసీడింగ్స్‌ అందుకున్న కొత్త లబ్ధిదారులకు ఈ నెల 19వ తేదీ నుంచి పింఛన్‌ నగదును చెల్లిస్తారు. సాధారణ పింఛన్‌దారులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున ప్రభుత్వం అందించనుంది.కొత్త జీఓ ప్రకారం.. పింఛన్‌దారు చనిపోతే వెంటనే అతని భార్యకు ఆ పింఛన్‌ను బదిలీ చేసి ఇస్తారు. దివ్యాంగుల దరఖాస్తులను సదరం సర్టిఫికెట్‌ లేదనే కారణంతో రిజెక్ట్‌ చేయరు. సదరం క్యాంపు ద్వారా వారికి సర్టిఫికెట్‌ వచ్చే వరకు ఆ దరఖాస్తులను హోల్డ్‌లో ఉంచుతారు.

చేయూత దరఖాస్తుల ప్రక్రియ ఇలా..

వచ్చిన మొత్తం దరఖాస్తులు 17,480

ఆన్‌లైన్‌లో ట్యాగ్‌ చేసినవి 17,478

అర్హత పొందినవి 14,478

అనర్హులుగా తేలినవి 2,652

హోల్డ్‌లో ఉంచినవి 336

ఎంపీడీఓ స్థాయిలో

ఆమోదించినవి 14,310

తిరస్కరించినవి 2,399

పెండింగ్‌ 421

ఫ 19 నుంచి పంపిణీకి సన్నాహాలు

ఫ సుమారు 13 వేల మందికి లబ్ధి

ఫ 11 లోగా లబ్ధిదారుల తుది జాబితా

ఫ 12 నుంచి 18 వరకు ప్రొసీడింగ్స్‌ అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement