ఆత్మకూరు(ఎం): అన్ని కేసుల దర్యాప్తును నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ సూచించారు.సోమవారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. స్టేషన్‌కు సంబంధించి రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలన్నారు. ఆయన వెంట సీఐ ఎం. రవి, ఎస్‌ఐ ఎన్. లక్ష్మీనారాయణ ఉన్నారు.
ప్రాతినిధ్యం వహించడం గొప్పవిషయం
భువనగిరిటౌన్ : జాతీయ వేదికపై జిల్లా యువత, ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించడం గొప్పవిషయమని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో పాల్గొన్న జిల్లా బృందం సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసింది. నోడల్ అధికారి, జిల్లా యువజన క్రీడల అధికారి కె.ధనంజనేయులు ఆధ్వర్యంలో వెళ్లిన 16 మంది సభ్యుల బృందం తమ పర్యటన విశేషాలను కలెక్టర్‌కు వివరించి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచులు ర్యాకల సంతోష శ్రీనివాస్, కోమటిరెడ్డి సంతోష, భూక్యా సంతోష్ కుమార్, ఉప్పల విజయలక్ష్మి, ప్రతినిధులు సరగడ కరుణ్, అంబేద్కర్, వేణు, డాక్టర్ రాజ్ కుమార్, కొర్ణ నరేష్, సాయినాథ్, వట్టేపల్లి నరేష్, విజయ్, రామ్ చరణ్ తేజ్, శివకుమార్, రామనవాసు, వెంకట నరసింహ పాల్గొన్నారు.


