న్యూస్‌రీల్
గోదాములు ఎంపిక చేస్తున్నాం
మిల్లులకు కేటాయింపులు వద్దు
17 రోజులైంది
ధాన్యం తడిసింది
మంగళవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2026
అర్జీల పరిష్కారంలో
జాప్యం చేయవద్దు
ఫ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో జాప్యం చేయవద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మతో కలిసి ఆయన 158 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ శాఖ 102, హౌసింగ్ 12, ఉపాధి కల్పన 7, ఎస్సీ కార్పొరేషన్ 5, గ్రామీణ అభివృద్ధి శాఖ 4, సర్వే ల్యాండ్స్ 4, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 4, మండల పరిషత్ 3, విద్య 2, వైద్య ఆరోగ్య 2, మున్సిపాలిటీ 2, పంచాయతీ 2, మైన్స్, విద్యుత్, సివిల్ సప్లయ్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, ఈడీఎం , వ్యవసాయం, సంక్షేమం, ఇరిగేషన్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణా రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ సాత్విక్, డీసీఓ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎయిమ్స్‌లో విజిలెన్స్ ‘అవగాహన వారం’
భువనగిరి(బీబీనగర్): బీబీనగర్ ఎయిమ్స్‌లో సోమవారం విజిలెన్స్ వారం–2026ను పురస్కరించుకుని ప్రభుత్వ ఈ–మార్కెట్ ప్లేస్ , విజిలెన్స్ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మార్కెట్ ప్లేస్ శిక్షకురాలు జి. సరిత హాజరై ఎయిమ్స్ సిబ్బందికి పలు కీలక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా సేకరణ పద్ధతులు, నియమాల అనుగుణ్యత, సాంకేతిక నిర్దేశాలు, విధుల పట్ల సమగ్రత, అప్రమత్తత, పర్యవేక్షణ అంశాలే వివరించారు. అనంతరం సరితను సన్మానించారు.
సాంకేతిక నైపుణ్యాలతో బోధన మెరుగు
నల్లగొండ టూటౌన్ : అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో అధ్యాపకుల బోధన మెరుగుపడుతుందని ఎంజీయూ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో అధ్యాపకులకు బోధన, సాంకేతిక నైపుణ్యాలపై ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. అధ్యాపకులకు పైతాన్, మెషిన్ లెర్నింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, కృత్రిమ మేధా, సాప్ టెక్ స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చారని తెలిపారు.
సాక్షి, యాదాద్రి: ప్రభుత్వం, రైస్ మిల్లర్ల మధ్య నెలకొన్న వివాదంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.ఈసారి తమ మిల్లుల్లో ధాన్యం దించుకునేది లేదని మిల్లర్లు తేల్చిచెప్పడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. అధికారులు గత సోమవారం నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా మిల్లుల కేటాయింపు జరగక ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కిలో వడ్లను కూడా కొనుగోలు చేయలేదు.ప్రభుత్వం, మిల్లర్ల మధ్య పంచాయితీ కొలిక్కిరాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూడు వారాలకు పైగా కళ్లాల్లోనే ధాన్యం రాశులు పోసి అమ్ముకోవడానికి కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సోమవారం నారాయణపురం, చౌటుప్పల్, రామన్నపేట, పోచంపల్లి, వలిగొండ, భువనగిరి, మోత్కూరు, అడ్డగూడూరు, ఆలేరు, ఆత్మకూర్(ఎం), మోటకొండూరు, యాదగిరిగుట్ట, రాజాపేట తదితర మండలాల్లోని కొనుగోలు కేంద్రాలపై నిర్వహించిన గ్రౌండ్ రిపోర్టులో అన్నదాతల కష్టాలు కళ్లకు కట్టినట్లు వెలుగుచూశాయి.
అనుమతులు రాక..
జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్, ఐకేపీ, వ్యవసాయ మార్కెట్, ఎఫ్‌పీఓల ద్వారా దాదాపు 335 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం కొంటుందన్న ఆశతో రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి కుప్పలుగా పోశారు. సివిల్ సప్లయ్ అధికారులు ఇంతవరకు మిల్లులను కేటాయించలేదు. దీంతో కేంద్రాల నిర్వాహకులకు కొనుగోలు అనుమతులు రాక.. కిలో వడ్లు కూడా కొనలేదు.
వణికిస్తున్న తుపాను ముప్పు
ఇటీవల కురిసిన వర్షాలకు భువనగిరి, వలిగొండ, రామన్నపేట, పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల్లోని కేంద్రాల్లో కొంతమేర ధాన్యం తడిసిపోయింది. దీనికి తోడు వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేట్ వ్యాపారులకే తక్కువ ధరకు..
ప్రభుత్వం సీఎంఆర్ వడ్ల విషయంలో తనిఖీలు ముమ్మరం చేయడంతో, ఇదే అదనుగా కొందరు మిల్లర్లు ప్రైవేట్‌గా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వేచిచూడలేక పలుచోట్ల రైతులు తమ ధాన్యాన్ని ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. ఈ పరిణామాలతో మూసీయేతర ప్రాంతాల్లోని సగం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నామమాత్రంగానే ఉండగా.. మూసీ పరివాహక మండలాల్లోని కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడం గమనార్హం.
కొనుగోలు కేంద్రాలు
పీఏసీఎస్ 188
ఐకేపీ 141
ఎఫ్‌పీఓలు 13
మెప్మా 03
గత నెల 18న మార్కెట్‌కు ధాన్యం తెచ్చాను. ఇప్పటివరకు కాంటాలు వేయడం లేదు. ఇటీవల కురిసిన వర్షంతో ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యం ఆరబోసేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. త్వరగా కాంటాలు వేసి ధాన్యం కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఉండవు. ధాన్యం తీసుకువచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు రోజూ కుప్ప వద్దకు వచ్చి వెళ్తున్నాను.
– సురుకంటి నర్సిరెడ్డి, రైతు, చౌటుప్పల్
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
భువనగిరి: విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని డీఈఓ భిక్షపతి అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ అండర్–17 వాలీబాల్ జిల్లా స్థాయి పోటీలకు ఆయన హాజరై మాట్లాడారు. క్రీడల వల్ల శారీక దృఢత్వం, క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందన్నారు. అనంత రం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా నోడ ల్ ఆఫీసర్ కృష్ణమూర్తి, పీఆర్‌టీయూ అధ్యక్షుడు మధుసూదన్‌పాల్గొన్నారు.
విజేత జట్లు ఇవే..
జిల్లా స్థాయి వాలీవాల్ పోటీల్లో బాలుర విభాగంలో ప్రథమ బొమ్మలరామారం, ద్వితీయ భువనగిరి జట్లు గెలుచుకోగా బాలికల విభాగంలో ప్రథమ బొమ్మలరామారం, ద్వితీయ ఆలేరు జట్లు విజేతలుగా నిలిచాయి.
కలెక్టరేట్ ఎదుట రహదారిపై ధర్నా చేస్తున్న చౌటుప్పల్ వాసులు
భువనగిరిటౌన్ : చౌటుప్పల్ పట్టణంలో చేపట్టిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. రహదారిపై పెద్ద సంఖ్యలో బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ ఎరగదిండ్ల భాస్కర్ మాట్లాడుతూ.. చౌటుప్పల్ పట్టణంతో పాటు పరిసర మండలాలు, గ్రామాల ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందేందుకు ఈ 100 పడకల ఆస్పత్రి ఎంతో కీలకమన్నారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో అత్యవసర సమయాల్లో వైద్యం అందక పేద, మధ్యతరగతి రోగులు హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణం పూర్తి చేసి సరిపడా వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అశోక్, బత్తుల దాసు, బుద్ద సురేష్, మార్గం శివ, బోలా వెంకటేష్, ఆలె చిరంజీవులు, వీఎల్వీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
రైతు ఉత్పత్తి సంస్థలుగా
ఉమ్మడి జిల్లాలో 37 పీఏసీఎస్‌లను ప్రభుత్వం రైతు ఉత్పత్తి సంస్థలుగామారుస్తోంది.
- 8లో
ఫ కేంద్రాల్లో ధాన్యం పోసి మూడువారాలుదాటినా కొనేదిక్కులేదు
ఫ సర్కారు, మిల్లర్ల వివాదంలో నలిగిపోతున్న అన్నదాత
ఫ మిల్లుల కేటాయింపు లేక నిలిచిపోయిన ధాన్యం సేకరణ
ఫ తుపాను హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన
ఫ దిక్కుతోచక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయం
ప్రభుత్వం నిర్ణయం ప్రకారం డిఫాల్ట్ మిల్లులకు ధాన్యం ఇవ్వొద్దని నిర్ణయించాం. జిల్లాలో 40 మిల్లుల్లో 25 మిల్లుల వరకు ధాన్యం ఇచ్చేందుకు అర్హత ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో కొనుగోలు చేసే ధాన్యంలో కొంత మిల్లులకు, మరికొంత ప్రభుత్వమే గోదాముల్లో నిల్వచేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. గత సీజన్‌లో మిల్లుల్లో స్థలం లేక కొనుగోలు చేసిన 1.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాముల్లో నిల్వ చేశాం. –డి. హరికృష్ణ, పౌరసరఫరాలశాఖ డీఎం
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో గత నెల 31న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటివరకు కాంటాలు వేయలేదు. రైతులు మార్కెట్ యార్డ్ కు 25 రోజుల క్రితం నుంచే ధాన్యం తెస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 80 కి పైగా ధాన్యం కుప్పలు అమ్మకానికి ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి కుప్పలు తడవగా ఆరబోసుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. వాతావరణంలో మార్పులు.. గన్నీ బ్యాగులు రాకపోవడం.. రైస్ మిల్లుల కేటాయింపు జరగకపోవడం వంటి కారణాలతో తూకాలు ప్రారంభించ లేదు.
జిల్లాలో ప్రస్తుతం రైస్ మిల్లుల వద్ద 2024–25, 2025–26 ధాన్యం సుమారు 4.80 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది. ప్రస్తుతం మిల్లుల వద్ద ఉన్న ధాన్యం నిల్వల మిల్లింగ్ బియ్యం ఎఫ్‌సీఐకి డెలివరీ చేసే వరకు మిల్లర్లు కొత్త ధాన్యం దించుకునే పరిస్థితిలో లేరు. మిల్లుల్లో నిల్వలు ఖాళీ కాక ముందే కొత్త ధాన్యం కేటాయించవద్దు. ఈ మేరకు అసోసియేషన్ నుంచి సోమవారం అధికారులతో జరిగిన సమావేశంలో లిఖిత పూర్వకంగా వివరించాం.
–మార్త వెంకటేశం, జిల్లా రైస్ మిల్లర్స్
అసోసియేషన్ అధ్యక్షుడు
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 17 రోజులైంది. 95 సీరియల్ నంబర్ ఇచ్చారు. కాంటాలు ఇంకా మొదలు కాలేదు.సెంటర్ వరి కుప్పలతో నిండిపోయింది. స్థలం లేక పక్కనే ఉన్న డబుల్‌బెడ్ రూం ఇళ్లలోపోస్తే వర్షానికి వడ్లు తడిసిపోయాయి. వడ్లు ఆరబోయడం, అమ్మడం చాల ఇబ్బంది మారింది.
– రావుల లలిత, రేవణపల్లి,
పోచంపల్లి మండలం
వడ్లను కొనుగోలు కేంద్రానికి తెచ్చి వారం రోజులుగా ఆరబెడుతున్నా. వడ్లను కొనుగోలు చేస్తలేరు. వర్షానికి ధాన్యం తడిసింది. రూ. 3500 ఖర్చు చేసి ప్రైవేట్ గా పరదాలు కొనుక్కుని కప్పాను. మిల్లర్లు వడ్లు తీసుకోవడం లేదని అందుకే తూకం వేయడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
–కాదూరి సత్తయ్య,ౖ మెలార్ గూడెం, రైతు,
యాదగిరిగుట్ట మండలం


