సాక్షి, యాదాద్రి: పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఈ–వేలంలో జిల్లాకు చెందిన మిల్లర్లు సుమారు 58,210.89 మెట్రిక్ టన్నుల ధాన్యం టెండర్లను దక్కించుకున్నారు. 2025–26 యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలోని మిల్లులు, గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం టెండర్ల ద్వారా విక్రయించింది.
లక్ష్యానికి మించి నిల్వలు..
జిల్లాలోని మిల్లుల్లో సుమారు 92,000 మెట్రిక్ టన్నులు, గోదాములలో 1,30,000 మెట్రిక్ టన్నులు కలుపుకుని మొత్తం సుమారు 2,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతానికి 58,210 మెట్రిక్ టన్నులకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేలంలో క్వింటా ధాన్యం ధరను రూ. 2,394 గా నిర్ణయించారు. ఈ టెండర్ ప్రక్రియలో 24 మంది మిల్లర్లు పాల్గొన్నారు.
నిబంధనలు కఠినం..
టెండర్ దక్కించుకున్న మిల్లర్లు ఆ మొత్తాన్ని 30 రోజుల్లోగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మిల్లుల వద్ద ధాన్యం ఉన్నా, లేకపోయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందే. ఒకవేళ నిల్వలు లేకపోతే మిల్లుల యజమానులు పెనాల్టీ రూపంలోనైనా ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయాలి లేదా ధాన్యానికి బదులు వడ్లనైనా సమకూర్చాల్సి ఉంటుంది. ఈ–వేలం ప్రక్రియ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఫ 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం టెండర్ల ఖరారు
ఫ క్వింటాకు రూ. 2,394 చొప్పున ధర నిర్ణయం
ఫ 30 రోజుల్లోగా ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సిందేనని స్పష్టీకరణ


