పక్కా భవనాలు కరువు | - | Sakshi
Sakshi News home page

పక్కా భవనాలు కరువు

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

పక్కా భవనాలు లేని గ్రామ పంచాయతీలు

ఈ ఫొటోలో కనబడుతున్న వారు బొమ్మలరామారం మండలం గోవింద్‌తండా పంచాయతీ పాలక వర్గ సభ్యులు. 2018లో ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీకి కార్యాలయ భవనం లేక నాటినుంచి నేటికీ ఓ అద్దె భవనంలోనే అరకొర వసతుల నడుమ కొనసాగుతోంది. నెలకు రూ.1,200 చొప్పున అద్దె చెల్లిస్తున్నామని గ్రామ సర్పంచ్‌ ధీరావత్‌ మున్యా తెలిపారు. ఇలా జిల్లాలో మొత్తం 44 పంచాయతీలకు పక్కా భవనాలు లేవు. వీటిలో 38 వరకు ఇతర ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా.. ఆరేడు వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

బొమ్మలరామారం : పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినప్పటికీ చాలా చోట్ల పక్కా భవనాలు కరువయ్యాయి. జిల్లాలోని 427 గ్రామ పంచాయతీలకు 383 పంచాయతీలకు పక్కా కార్యాలయ భవనాలు ఉన్నాయి. మిగతా 44 గ్రామాలకు పంచాయితీకు పక్కా భవనాలు లేవు. దీంతో ఆయా పంచాయతీ కార్యాలయాలను కొన్నిచోట్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో, మరికొన్ని చోట్ల పాఠశాలల తరగతి గదుల్లో, కమ్యూనిటీ, మహిళా సంఘం భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల రేకుల గదులు, ప్రైవేటు వ్యక్తుల అద్దె ఇళ్లలో అరకొర వసతుల నడుమ కొనసాగిస్తున్నారు. ఫలితంగా పక్కా భవనాలు లేని పంచాయతీ పాలక వర్గాలు పాలనా పరమైన సమావేశాలు, అధికారిక కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి గదుల్లో కొనసాగే పంచాయతీల్లో సమావేశాల సమయంలో ప్రజలకు కూడా సౌకర్యాలు కరువయ్యాయి.

44 పంచాయతీలకు సొంత బిల్డింగ్‌లు లేవు

ఫ స్కూళ్లు, అంగన్‌వాడీలు, అద్దె ఇళ్లలో నిర్వహణ

ఫ ఇబ్బందుల్లో పాలకవర్గాలు, ప్రజలు

ఫ జిల్లాలో మొత్తం 427 పంచాయతీలు

బొమ్మలరామారం: ఫక్కీర్‌గూడెం, మైలారం కిందితండా, గోవింద్‌తండా, మునీరాబాద్‌, ఖాజీపేట్‌, రామస్వామి తండా, వాలుతండా, యావపూర్‌,

కంచల్‌తండా.

ఆలేరు: కందిగడ్డతండా, సాయిగూడెం.

ఆత్మకూరు(ఎం): సారగళ్లగూడెం.

బీబీనగర్‌: పెద్దపలుగు తండా, రావిపహాడ్‌ తండా, ఎర్రబెట్టె తండా, నీలాతండా, మహాదేవపూర్‌, జియాపల్లి తండా.

చౌటుప్పల్‌: చింతలగూడెం, ఎల్లంబావి, కై తాపురం.

గుండాల: బూర్జూబావి, పాచిల్ల.

మోటకొండూరు: అబింద్‌నగర్‌, ఆరెగూడెం, గిరిబోయినగూడెం, కదిరేనిగూడెం, పెద్దబా వి, సికిందర్‌నగర్‌. మోత్కూరు: రాగిబావి.

నారాయణపూర్‌: బోటిమీదతండా, డాకుతండా, గంగముల్లతండా, కడపగండి తండా, లింగవారిగూడెం, మర్రిబావి తండా, పల్లెగట్టు తండా, పోర్లగడ్డ తండా, రాచకొండ, రాధానగర్‌ తండా, తుంబావి తండా, వెంకంబావి తండా, వాచ్యతండా.

రాజాపేట: కొత్తజాల.

రామన్నపేట: కొత్తగూడెం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement