పత్తి క్వింటాకు రూ.9,300 | - | Sakshi
Sakshi News home page

పత్తి క్వింటాకు రూ.9,300

Oct 24 2026 10:20 AM | Updated on Oct 24 2026 10:20 AM

ఆత్మకూరు (ఎం): ఆత్మకూరు (ఎం) మండల కేంద్రంలోని సిద్ధేశ్వర కాటన్‌ మిల్లులో పత్తికి క్వింటాకు రూ.9,300 ధర చెల్లిస్తున్నారు. ఈసారి దిగుబడి సరిగా లేకపోవడంతో కేవలం 10 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగామని మిల్లు యాజమాన్యం తెలిపింది.

ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

బొమ్మలరామారం : తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని బొమ్మలరామారం మండల నోడల్‌ అధికారి, డీఈఓ భిక్షపతి సూచించారు. బొమ్మలరామారం మండలంలోని బండకాడిపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాతావరణంలో వచ్చే మార్పులు, లోటు వర్షపాతం వల్ల పంటలకు జరిగే నష్టాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాధ, ఎంపీడీఓ శ్యామల, ఎంపీఓ శశికళ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ అశోక్‌, ఇరిగేషన్‌ ఏఈ ప్రమోద్‌, మిషన్‌ భగీరథ ఏఈ శ్రీజ, ఏపీఓ శ్రీలక్ష్మి, టీఏ మంజుల, సర్పంచ్‌ పెద్దిరెడ్డి మల్లారెడ్డి, ఏఈఓలు వరలక్ష్మి, సీమా, పంచాయతీ కార్యదర్శి అనురాధ, మస్తులు పాల్గొన్నారు.

ఊంజల్‌ సేవోత్సవం

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవాన్ని అర్చకులు కనులపండువగా నిర్వహించారు. అమ్మవారికి శుక్రవారం ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఆలయ మండపంలో ఆండాళ్‌ దేవిని వజ్ర వైఢూర్యాలు, రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేక సేవపై అధిష్టింపజేసి, ఆలయ తిరు వీధులు, మాడ వీధుల్లో మంగళవాయిద్యాల నడుమ వైభవంగా ఊరేగించారు. తదుపరి అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టింపజేసి, ఆగమ శాస్త్రోక్తంగా ఊంజల్‌ సేవోత్సవాన్ని నిర్వహించారు. ఇక శ్రీస్వామివారి ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య కై ంకర్యాలు శాస్త్రోక్తంగా సాగాయి. క్షేత్రానికి వచ్చిన భక్తులు వివిధ రకాల నిత్య పూజలు, సువర్ణ పుష్పార్చనలు, వ్రతాల్లో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.

అక్రమ కేసులను ఎత్తివేయాలి

భువనగిరి : బీఆర్‌ఎస్‌ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జక్కా రాఘవేందర్‌రెడ్డి శుక్రవారం ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై భౌతిక దాడులు జరుగుతున్న సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు పట్టించుకోకపోగా, ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో సర్పంచులు జనగాం పాండు, పడాల వెంకటేశ్వర్లు, కటిక జంగయ్య, కంకల లలిత, నాగెల్లి గిరిజ రమేష్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి ఓం ప్రకాష్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement