నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Oct 24 2026 10:20 AM | Updated on Oct 24 2026 10:20 AM

గుండాల : నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కోరారు. శుక్రవారం మండలంలోని పాచిల్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు తీయాలని, ఫామ్‌ పాండ్స్‌ నిర్మించుకోవాలన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోతున్న నేపథ్యంలో రైతులు మూగ జీవాలను కాపాడుకునేందుకు పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై అందిస్తున్న గడ్డి గింజలను సాగు చేసి పశువులను కాపాడుకోవాలని కోరారు. గ్రామాలలో ఉన్న నీటి తొట్లకు మరమ్మతులు చేపట్టి నీటిని నింపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంతకు ముందు పాచిల్ల గ్రామ ఊర చెరువులో చేపడుతున్న వీబీజీరామ్‌జీ పనులను కలెక్టర్‌ పరిశీలించి కూలీలతో మాట్లాడారు. అనంతరం చేనేత సహకార సంఘంలో నేతన్నలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీపీఓ శ్రీని వాస్‌రెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, ఏడీ శ్రీనివాసరావు, సర్పంచ్‌లు అల్లంశెట్టి మహేష్‌, చేనేత సహకార సంఘం చైర్మన్‌ చిందం ప్రకాష్‌, తహసీల్దార్‌ ఎస్‌.హరికృష్ణ, ఎంపీడీఓ చండీరాణి, డాక్టర్‌ హైమావతి, వెటర్నరీ డాక్టర్‌ ప్రత్యూష, ఎంఏఓ సూరజ్‌కుమార్‌, ఏపీఓ ఇమ్మాన్యుయల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ భావన, కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి

భువనగిరి(భువనగిరి టౌన్‌) : ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. కలెక్టరేట్‌లో ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమం అమలుపై శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌కు ప్రాథమిక నైపుణ్యాలే పునాది అని.. ప్రతి విద్యార్థీ సరైన రీతిలో చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు నేర్చుకునేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ భిక్షపతి, అకాడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ జానీ అఫ్గాన్‌, ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement