చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పట్టణంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాలను పూర్తిగా సర్వీస్‌రోడ్డు మీదుగా పంపిస్తున్నారు. తాజాగా వలిగొండ జంక్షన్ వద్ద కూడా వాహనాలను సర్వీస్‌రోడ్డు మీదుగా మళ్లించారు. దీంతో సర్వీస్‌రోడ్డు ఇరుకుగా మారడంతో వాహనాలు వేగంగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామ శివారులోని తంగేడువనం పార్కు నుంచి లింగోజిగూడెం గ్రామ శివారు వరకు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. రద్దీ మూలంగా వచ్చే దుమ్ము, ధూళితో స్థానిక దుకాణాదారులు, బాటసారులు ఇబ్బందులకు గురయ్యారు.


