గ్రామపంచాయతీలు బాధ్యతగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామపంచాయతీలు బాధ్యతగా తీసుకోవాలి

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

యాదగిరిగుట్ట రూరల్‌: గ్రామ పంచాయతీలు బాధ్యతగా తీసుకుని వీబీజీరామ్‌జీ పనులను ఉపాధి హామీ కూలీలచే చేయించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్‌ కమిషనర్‌ శ్రీలక్ష్మి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలో నిర్వహించిన వీబీజీ రామ్‌జీ ప్రత్యేక గ్రామసభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్లాన్‌ విధానాలపై చర్చించారు. 375 పనులు ఉన్నాయని, ఈ పనులన్నీంటిని గ్రామంలోని ఉపాధిహామీ కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు, జాయింట్‌ కమిషనర్లు మోర శ్రీనివాస్‌, శేషుకుమార్‌, అడిషనల్‌ డీఆర్‌డీఓ సురేష్‌, ఇన్‌చార్జి ఎంపీడీఓ ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఓ లింగంపల్లి నర్సయ్య, టీఏ వెంకటనారాయణ, పంచాయతీ సెక్రటరీ అశోక్‌, సర్పంచ్‌ వగ్గు రవళి పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ

స్పెషల్‌ కమిషనర్‌ శ్రీలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement