సత్ప్రవర్తనతో మెలగాలి | - | Sakshi
Sakshi News home page

సత్ప్రవర్తనతో మెలగాలి

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

భువనగిరిటౌన్‌ : తెలిసీ తెలియక చేసిన తప్పులతో జైలు జీవితం గడుపుతున్న ఖైదీలు ఇకపై సత్ప్రవర్తనతో మెలిగి మంచి మార్గంలో నడవాలని భువనగిరి ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఉషశ్రీ అన్నారు. గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భువనగిరి సబ్‌జైలులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని జీవితాలను నష్టపరుచుకోవద్దన్నారు. కార్యక్రమంలో సబ్‌జైలు పర్యవేక్షకుడు జాతోతు నెహ్రూ, డిప్యూటీ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ బొమ్మ వెంకటేష్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ నారగోని రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement