రహదారి నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, సమస్యలు తలెత్తకుండా నిర్మాణం జరగాలి. 800 మీటర్ల దూరం తిరిగి రాకపోకలు సాగించాలంటే రెండు వైపులా కలుపుకుంటే కిలోమీటరున్నర దూరం అవుతుంది. జనంపై ఎలాంటి భారం పడకుండా ఉండేలా ప్రతి ఐదు వందల మీటర్ల ఒకటి పీయూపీ ఇవ్వాలి. వ్యాపారులు, దుకాణాదారుల పొట్టకొట్టొద్దు.
– సుర్కంటి రాజిరెడ్డి, వ్యాపారి, చౌటుప్పల్
రహదారి నిర్మాణం చేస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు తప్పనిసరిగా స్థానిక ప్రజలు, వ్యాపారుల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలి. ఎవరికివారు సొంత ప్లాన్ రూపొందించి నిర్మాణం చేయడం మూలంగా జీవితాంతం ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అందరిని దృష్టిలో ఉంచుకొని అండర్‌పాస్‌ను నిర్మించాలి.
– బొడ్డు అంజిరెడ్డి, చౌటుప్పల్


