నెరవేరనున్న సొంతింటి కల | - | Sakshi
Sakshi News home page

నెరవేరనున్న సొంతింటి కల

Aug 31 2026 9:39 AM | Updated on Aug 31 2026 9:39 AM

భువనగిరిటౌన్‌ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేదల సుదీర్ఘకాల సొంతింటి నిరీక్షణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సింగన్నగూడెం వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సోమవారం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు అధికారికంగా అందజేయనున్నారు.

మౌలిక వసతుల కల్పనతో మార్గం సుగమం

గత ప్రభుత్వ హయాంలో 444 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ, కనీస మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్‌, రోడ్లు,డ్రెయినేజీ వ్యవస్థలను పట్టించుకోలేదు. దీంతో పంపిణీ నిలిచిపోయి నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారు. అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి, ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల పనులను పూర్తి చేయించి ఇళ్ల పంపిణీకి మార్గం సుగమం చేశారు.

పారదర్శకంగా సర్వే

లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం 360 డిగ్రీల సమగ్ర సర్వేను నిర్వహించింది. క్షేత్రస్థాయిలో చేపట్టిన ఈ విచారణ ద్వారా.. గతంలో అక్రమంగా జాబితాలోకి వచ్చిన అనర్హుల పేర్లను తొలగించారు. నిజమైన నిరుపేదలకు ఇళ్లు దక్కేలా అత్యంత పారదర్శకమైన జాబితాను అధికారులు సిద్ధం చేశారు.

రెండు విడతల్లో పంపిణీ

సముదాయంలోని మొత్తం 444 ఇళ్లలో మొదటి విడత కింద 408 ఇళ్ల తాళాలను సోమవారం లబ్ధిదారులకు అందజేయనున్నారు. మిగిలిన 36 ఇళ్లను రెండో విడతలో పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఏళ్ల తరబడి కాగితాలకే పరి మితమై, నిర్మాణం పూర్తయినా పంపిణీకి నోచుకోని ఇళ్లు ఇప్పుడు లబ్ధిదారుల చేతికి రానుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సొంతింటి కల నెరవేరుతుండటంతో లబ్ధిదారులు పండుగ వాతావరణంలో గృహప్రవేశాలకు సన్నద్ధమవుతున్నారు.

ఫ సింగన్నగూడెంలో నేడు

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ

ఫ పారదర్శకంగా

లబ్ధిదారుల ఎంపిక

ఫ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా అందించేందుకు ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement