రైతులు సద్వినియోగం చేసుకోవాలి
భువనగిరిటౌన్ : వానాకాలం సీజన్ ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక వరి నారుమడులు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే ఆరుతడి పంటల వైపు రైతాంగాన్ని మళ్లించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ఆరుతడి పంటల సాగుకు ముందుకొచ్చే రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో సోమవారం నుంచి ఈ నెల29 వరకు మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల్లో ప్రత్యేక విత్తన మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
నాణ్యమైన విత్తనాలు
వరి సాగుకు సమృద్ధిగా నీరు అవసరం కాగా, ప్రస్తుతం ఉన్న నీటి వనరులతో ఆరుతడి పంటలైన పెసర, మినుము, కందులు, జొన్న, సజ్జ, నువ్వుల పంటలు వేసుకోవడం శ్రేయస్కరమని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేళా ద్వారా వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను సబ్సిడీ లేదా నిబంధనల ప్రకారం రైతులకు అందిస్తారు.
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి. రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేశారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– పీవీ.రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
ఫ రైతు వేదికల్లో మూడు రోజుల
పాటు నిర్వహణ
ఫ ఆరుతడి పంటల సాగు వైపు రైతులను మళ్లించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ


