ఆలేరు : విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జి, రాహుల్‌గాంధీ, ప్రతిపక్ష నేతల అరెస్టులను వ్యతిరేకిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు డీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ఆలేరు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టి, ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి, నివాళుర్పించారు. ఈసందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ బీజేపీ పాలనలో పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు సాధారణ ఘటనలుగా మారాయని విమర్శించారు. కేంద్రం వైఫల్యంతోనే నీట్‌తోపాటు ఇప్పటి వరకు152 ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనకు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ ఘటనపై విద్యార్థులకు మోదీ బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీతోపా టు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఆయన ఖండించారు. తెలంగాణలో మోదీ, బీజేపీ ఆటలు సాగవని స్పష్టం చేశారు. సర్ పేరుతో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, అలాంటి చర్యలను అడ్డుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి యువత అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మున్సి పల్ చైర్‌పర్సన్ బీజన బాలమణి, వైస్ చైర్మన్ అంగిడి ఆంజనేయులు, కౌన్సిలర్లు జూకంటి సంపత్, నాయకులు ఇజాజ్, బీజన భాస్కర్, జెట్ట సిద్ధులు, రాజశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
ఫ కేంద్రం వైఫల్యంతోనే నీట్ సహా 152 ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు
ఫ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
ఫ తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు
ఫ ఆలేరులో నిరసన దీక్షలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


