బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి
సాక్షి,యాదాద్రి : చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని డీఆర్‌డీఓ నాగిరెడ్డి కోరారు. పీఎంఎఫ్‌ఎమ్‌ఈ పథకం ద్వారా ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన బ్యాంక్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు బుధవారం కలెక్టరేట్ లో ప్రత్యేక సింగిల్ విండో డ్రైవ్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ , వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సెర్ప్ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.


