సాక్షి,యాదాద్రి : స్వచ్ఛ భారత్ మిషన్–గ్రామీణ్ నిబంధనలకు అనుగుణంగా ఇకపై ప్రతి ఇల్లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలలో తప్పనిసరిగా నాలుగు రకాల చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ చెత్తను మూలం వద్దనే వేరు చేయడం ద్వారా తడి చెత్తను కంపోస్టింగ్ తయారు చేయడానికి, పొడి చెత్తను రీసైక్లింగ్‌కు ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు.
మృతిచెందిన ఓటర్ల వివరాలు ఇవ్వాలి
ఆలేరు : ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా మరణించిన ఓటర్ల వివరాలను కుటుంబ సభ్యులు లేదా సంబంధిత వ్యక్తులు స్వచ్ఛందంగా అధికారులకు ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి సూచించారు. బుధవారం ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధిలతో ఎస్‌ఐఆర్‌పై సమావేశం నిర్వహించారు. ఎవరైన ఓటర్లు తమ వివరాలను నమోదు చేసుకోని పక్షంలో ఆగస్టు 3వ తేదీలోపు బీఎల్‌ఓలను సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 97.90శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్టు ఆయన తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ రాందాస్ పాల్గొన్నారు.


