పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేయాలి
భువనగిరి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకుని పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం భువనగిరి మండలం ఆకుతోటబావితండా, బొల్లేపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసుకునేలా కార్యదర్శులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లు పూర్తి చేసుకుంటే రెండో విడత కింద అర్హులైనవారికి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా గ్రామాల్లో ఏర్పడిన పాలక వర్గాలు అభివృద్ధి పనులతో పాటు పారిశుద్ధ్య పనులుచేపట్టాలన్నారు.
పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి
భువనగిరిటౌన్ : పొరపాట్లు లేకుండా మున్సిపల్ వార్డు ఓటర్‌జాబితా సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీలో ముసాయిదా ఓటరు జాబితాను అదనపు కలెక్టర్ పరిశీలించారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులపై ఫిర్యాదులు అందితే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముసాయిదా ఓటరు జాబితాలో ప్రజలకు ఎవరికై నా ఎలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నా అర్జీలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఆయన వెంట భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం, సిబ్బంది ఉన్నారు.
నేడు ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగ వాణి యథాతథంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు రావచ్చని సూచించారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు రూ.5.50లక్షలు
భువనగిరి: ఇంటర్మీడియేట్ ప్రాక్టీకల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం జిల్లాకు రూ.5.50లక్షల నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రథమ సంవత్సరంలో 1,524 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,867 మంది విద్యార్థులున్నారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు గత ఏడాది ఒక్కో కళాశాలకు రూ. 25వేల చొప్పున మంజూరు చేసింది. కానీ ఈ సారి రూ. 50వేల చొప్పున మంజూరు చేసింది. దీంతో జిల్లాలో ఉన్న 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మొత్తం రూ. 5.50 లక్షలు నిధులు మంజూరయ్యాయి. కలెక్టర్ అనుమతులతో వారం రోజుల్లో పరికరాలు, సామగ్రి కొనుగోలు చేయనున్నట్లు డీఐఈఓ రమణి తెలిపారు.
డీఆర్‌డీఎల్ డైరెక్టర్ రాజుకు ఎంపీ అభినందనలు
రాజాపేట : డీఆర్‌డీఎల్ డైరెక్టర్, శాస్త్రవేత్త అంకతి రాజును ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఎల్ క్షిపణి తయారీ విధానం, అభివృద్ధి, కీలక నైపుణ్యంపై వీడియో ప్రజెంటేషన్ తిలకించారు. రాజాపేటలోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించి డీఆర్‌డీఎల్ డైరెక్టర్‌గా ఎదగడం ఎంతో గర్వంగా ఉందని అభినందించారు. అనంతరం ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి అంకతి రాజు డీఆర్‌డీఎల్ మిసైల్ జ్ఞాపికను అందజేశారు.
పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేయాలి
పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేయాలి


